Modi says the money used to buy drugs could be funding terrorist activities

against drug abuse, youngsters should say no to drugs, People should have the courage to say no to drugs, mann ki baat, sunday mann ki baat, 14th sunday mann ki baat, 3rd programme mann ki baat, mann ki baat programme, last sunday mann ki baat programme, sunday naredra modi programmes, mann ki baat drugs, modi youth, drug business to terrorism

Prime Minister Narendra Modi on Sunday spoke against drug abuse and said the money used to buy drugs could be funding terrorist activities.. (mann ki baat)

మాదక ద్రవ్యాల భరతం పడదాం., యువతకు "మన్ కీ బాత్" ద్వారా ప్రధాని పిలుపు

Posted: 12/15/2014 11:26 AM IST
Modi says the money used to buy drugs could be funding terrorist activities

మాదక ద్రవ్యాల సమస్య జాతీయ సమస్యని.. వీటిని ప్రభుత్వం, సమాజం ముఖ్యంగా యువకులు వీటిని నిరోధించటానికి నడుము బిగించాలని నిన్న రేడియో ద్వారా ఆకాశవాణి ‘మన్ కీ బాత్’ కార్యక్రమము ద్వారా మోడీ యువతకు ఈ సందేశాన్ని ఇచ్చారు .. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడోసారి జరిగిన "మన్ కి బాత్" కార్యక్రమంలో మోడీ తన మనసులో ఉన్న అంతరంగాన్ని విశ్లేశించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించాల్సి ఉందన్నారు.

మోడీ మాటల్లో.... మాదక ద్రవ్యాల కోసం వెచ్చించే సొమ్ము ఉగ్రవాదులకు చేరుతుందన్న విషయాన్ని గుర్తించాలని.. అది దేశ భద్రతకు ప్రమాదకరమని అన్నారు. వాటి వినియోగం జాతీయ సమస్య అని, ఈ బెడదను అరికట్టేందుకు ప్రభుత్వం, సమాజం కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు తోడ్పడేలా టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ దురలవాటు చీకటి, విధ్వంసం, వినాశనమనే మూడింటితో కలసి వస్తుంది. ఇది విధ్వంసానికి, వినాశనానికి కారణమయ్యే చీకటి స్నేహాలకు దారితీస్తుంది. ఈ బెడదను అరికట్టి దేశాన్ని రక్షించే ప్రక్రియను చేపట్టాల్సి ఉంది..’’ అని మోదీ వ్యాఖ్యానించారు. దేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చేందుకు, ఈ దురలవాటుకు దూరంగా ఉండేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపడతామని ప్రధాని తెలిపారు. మాదక ద్రవ్యాల బెడదను అరికట్టడానికి ప్రభుత్వం, సమాజం, చట్టం, కుటుంబం, స్నేహితులు అంతా కలసి పనిచేయాలన్నారు.

హరి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles