Hero vijay father says no to start makkal iyakkam political party

hero vijay political party, hero vijay political life, hero vijay party name, makkal iyakkam party, hero vijay father on political party life, vijay latest movie updates, tamilnadu political parties, vijay supports bjp, latest news updates

hero vijay father says no to start political party : tamil star hero faces opposite waves from his family for starting party with fans support, vijay father suggests him that act for 50years after that only think about political life

పార్టీ నడపటం అంత ఈజీ కాదు.. తమిళనాట ‘జనసేన’ కష్టమే

Posted: 12/09/2014 10:07 AM IST
Hero vijay father says no to start makkal iyakkam political party

సినిమాల్లో హీరోలు చాలా డైలాగులు చెప్తారు, కాని తమ వరకు వచ్చే సరికి మాత్రం వాటికి దూరంగా ఉంటారు. యువత రాజకీయాల్లోకి రావాలని కుళ్లును కడిగేసేందుకు బాధ్యత తీసుకోవాలని హీరోలు భారీ డైలాగులు చెప్పటం మనం చూశాం. కాని నిజజీవితంలో అదే కుళ్ళును కడిగేసేందుకు బయల్దేరేవారు ఎంతమంది.., వారిలో విజయం సాధించేవారెందరు?. ఈ లెక్కలు చూస్తే రాజకీయాల్లోకి వచ్చిన యువ సినిమా తారలను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. రాజకీయాల్లోకి వెళ్తామంటే సినిమాల్లో హీరోలకు ఎలాంటి కష్టాలు వస్తాయో వాస్తవిక జీవితంలోనూ అవే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా హీరో విజయ్ విషయంలో అదే జరిగింది.

తమిళంలో స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ పార్టీ పెడతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ కు  10లక్షలకు పైగా ఫ్యాన్స్ తో పాటు, 350కంటే ఎక్కువగా అభిమాన సంఘాలున్నాయి. వీరంతా విజయ్ ను రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు. అభిమానుల పిలుపుపై స్పందించిన స్టార్ హీరో ‘మక్కల్ ఇయక్కం’ పేరుతో ఓ సంఘాన్ని స్థాపించారు. దీని ద్వారా స్వచ్చంద, సేవా కార్యక్రమాలు చేస్తూ వీలయితే భవిష్యత్తులో పార్టీగా మార్చాలని ముందు చూపు ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే తమిళనాట పట్టుకోసం చూస్తున్న బీజేపి వంటి పార్టీలు విజయ్ క్రేజ్ ను ఉపయోగించుకునేందుకు రంగంలోకి దిగాయి. ఈ మద్య నరేంద్రమోడికి విజయ్ ప్రశంసలతో కూడిన లేఖ రాయగా., దీనికి తమిళ బీజేపీ నేతలు స్పందించటం, విజయ్ ను సంప్రదించటం చకచకా జరిగాయి. అన్ని కుదిరితే జనవరిలో కొత్త పార్టీ ప్రారంభించి ‘జనసేన’ తరహాలో బీజేపికి మద్దతు ఇవ్వాలని సన్నిహితులతో కలిసి వ్యూహం రచించారు. ఇదే విషయంపై సలహా కోరేందుకు తండ్రి చంద్రశేఖర్ వద్దకు వెళ్లగా విజయ్ కు చేదు అనుభవం ఎదురయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో పార్టి పెట్టి ఇబ్బందులు పడవద్దని విజయ్ కు ఆయన తండ్రి సూచించారని తెలుస్తోంది. ప్రజలకు సేవ చేయాలనుకుంటే.., యాబై సంవత్సరాల వరకు ఇండస్ర్టీలోనే కొనసాగి ఆ తర్వాత పార్టీ పెట్టి సేవ చేయాలని సలహా ఇచ్చాడట. రాజకీయాలంటే అనుకున్నంత ఈజీ కాదు.. కుట్రలు, కుతంత్రాలు, ఎత్తుగడలు, విమర్శలు, ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాటన్నిటినీ తట్టుకునేందుకు ఉన్న అనుభవం సరిపోదు కాబట్టి.., ఇంకాస్త ఎదిగిన తర్వాత పార్టీ గురించి ఆలోచించు అని సలహా ఇచ్చారట. పవన్ ‘జనసేన’ తరహాలో పార్టీ పెట్టి కింగ్ మేకర్ అవుదామనుకున్న విజయ్ ఆశలపై తండ్రి నీళ్లు చల్లాడు. అయితే చంద్రశేఖరన్ హీరో తండ్రిగా కాకుండా సగటు మనిషిగా ఆలోచించి సలహా ఇచ్చాడని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. ఇదే సమయంలో రాజకీయాలపై సినిమాలు తీసి గొప్ప సూక్తులు చెప్పే హీరోలు, ఇతర ప్రముఖులు, వాస్తవ జీవితంలో ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవటానికి ఇది ఉత్తమ ఉదాహరణ అని చెప్తున్నారు.

‘రాజకీయాలంటే అంత సులువు కాదు, ప్రజలకు సేవ చేయాలన్న ప్రతి ఆలోచనపై విమర్శలు వస్తాయి. అవన్ని భరించుకుంటూ నమ్మిన ప్రజలే అప్పుడప్పుడూ విమర్శలు చేసినా భరిస్తూ కొనసాగాలి. ఇది చాలా కష్టం..., కాని అసాధ్యం మాత్రం కాదు’ విజయ్ సరిగ్గా ప్రయత్నిస్తే ఆయన రాజకీయాల్లోకి రావచ్చు. కానీ అభిమానులను, తన వెంట ప్రస్తుతం ఉన్న కార్యకర్తలను నమ్ముకుని మాత్రం భవిష్యత్తును నిర్దేశించుకోవటం సరికాదు. ఆయన లక్ష్యాలు, అందుకు ఎంచుకునే మార్గంను క్లారిటీగా గీసుకుని బరిలోకి దిగితే... తమిళనాట మరో నేత చరిత్ర తిరగరాయవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero vijay political party  makkal iyakkam party  tamilnadu latest updates  

Other Articles