Sathyam ramalinga raju rama raju sentenced to 6 months in jail

sathyam, cbi, financial fruads, court, ramalingaraju, vadlamaani sreenivas, price water coupons

The Special Economic Offences Court in Hyderabad sentenced Satyam founder-chairman B Ramalinga Raju and his brother Rama Raju to six months in jail in the Rs 617 crore income tax fraud case

సత్యం కుంభకోణంపై తీర్పు వెలువరించిన న్యాయస్థానం

Posted: 12/08/2014 08:11 PM IST
Sathyam ramalinga raju rama raju sentenced to 6 months in jail

సరిగ్గా అయిదు సంవత్సరాల క్రితం ఐ టి రంగాన్ని బెంబేలేత్తించిన సత్యం కుంభకోణం పై ఎట్టకేలకు న్యాయస్థానం తీర్పు వ్యవహరించింది. 2009 సంవత్సరంలో వెలుగు చుసిన ఈ కుంభకోణంలో మొత్తం ఏడు  రకాల కేసు లను దాఖలు చేయగా ఒక కేసు ని కొట్టి వేయగా ఆరు కేసులకు సంబంధించిన తీర్పు ను  ప్రత్యేక న్యాయస్థానం వెలువరించింది.

సత్యం కుంభకోణం లో ప్రధాన నిందితులైన రామలింగ రాజు, రామరాజు లకి నాలుగు కేసు లలో ఒక్కో దానికి 6 నెలల జైలు శిక్ష విధించగా .., అయిదు కేసు లలో ఒక్కో దానికి 10 లక్షల జరిమానా విధించింది. మరో నిందితుడైన రామ్ మైనంపాటికి 3 కేసులలో 6 నెలల చొప్పున జైలు శిక్ష ఒక్కో దానికి 10 లక్షల జరిమానా విధించింది. తీర్పు పై అప్పీలు  చేసుకునేందుకు నెల పాటు గడువిచ్చింది. ఇతర నిందితులైన సత్యం మాజీ డైరెక్టర్లు కృష్ణ పాలెపు,, ఎన్ శ్రీనివాస్, వినోద్ కే ధామ్, టీ ఆర్ ప్రసాద్ లకు  ఒక్కొకరికి ఇరవై వేల చొప్పున జరిమానా విధించింది.

వడ్లమాని శ్రీనివాస్ కి మూడు కేసు లలో ఆరు నెలల చొప్పున జరిమానా విధించింది. దేశంలో ఒక సంచలనాన్ని సృష్టించిన ఈ కుంభకోణం పై మొట్ట మొదట సి బి ఐ దర్యాప్తు చేపట్టినప్పటికీ ఎన్నో పరిణామాల తర్వతా చిట్ట చివరకు ఆర్ధిక నేరాల ప్రత్యేక కోర్ట్  లో ఈ కేసు విచారణ సాగి ఇప్పటికీ  తీర్పు వెలువరించింది.

హరికాంత్ రామిడి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles