Ap capital land acquirement chandrababu statement

chandrababu on ap capital, ap government land acquiremment package, chandrababu on ap capital lands, andhra pradesh capital lands, andhra pradesh capital constuction lands, ap farmers on land acquirement, ap capital singapore model, ap capital japan technology, andhra pradesh latest news

ap capital land aquirement chandrababu statement : andhra pradesh chief minister chandrababu naidu announced land acquirement packages for farmers who losses land in capital construction process

అరచేతిలో బాబు భూ స్వర్గం.. పండగ చేసుకునే ప్యాకేజీలట

Posted: 12/08/2014 06:43 PM IST
Ap capital land acquirement chandrababu statement

రాజధాని నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేసింది. భూ సమీకరణకు సిద్దమయిన సర్కారు.., భారీ స్థాయిలో పరిహార ప్యాకేజిని ప్రకటించింది. అనేక రాష్ట్రాల్లో అమలు చేసిన విధానాలు పరిశీలించిన ప్రభుత్వం ఉత్తమ ప్యాకేజి రూపొందించిందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్యాకేజీపై ప్రకటన చేసిన ఆయన.., గతంలో ఉమ్మడి రాష్ర్టంలో సైబరాబాద్ సిటీ నిర్మాణంలో కూడా భూ సమీకరణ విధానం అమలు చేశామన్నారు. అప్పట్లో భూములు ఇచ్చిన రైతులు ప్రస్తుతం సంతోషంగా ఉన్నారని వివరించారు. రాజధానికి భూములిచ్చే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఉత్తమ ప్యాకేజిని రూపొందించామని బాబు చెప్పారు.

రాజధానిలో భూ సేకరణ కోసం మూడు జోన్లను గుర్తించిన ఏపీ ప్రభుత్వం సేకరణ పరిధిని ప్రకటించింది. ఇన్నర్ రింగ్ లో 75 కిలోమీటర్ల లోపు భూ సేకరణ చేస్తుండగా.., అవుటర్ రింగ్ లో 200 కిలోమీటర్ల లోపు సమీకరిస్తోంది. ఇక మిడిల్ రింగ్ లో 125 కిలోమీటర్ల లోపున భూ సమీకరణ చేస్తోంది. గుంటూరు, విజయవాడ పరిసరాల్లో భూముల సమీకరణ చేస్తున్నట్లు ప్రకటించి అందుకు సంబంధించిన పరిహార వివరాలు వెల్లడించటం జరిగింది.

ప్యాకేజి ముఖ్యాంశాలు

* మెట్ట, జరీబు భూములకు వేర్వేరుగా పరిహారం ప్రకటించారు.
* మెట్ట భూములు ఇచ్చే రైతులకు ఎకరాకు నివాస యోగ్య ప్రాంతంలో వెయ్యి గజాల భూమి, వాణిజ్య ప్రాంతంలో మరో 200 గజాల భూమి భూమి ఇస్తామన్నార.
* జరీబు భూములకు నివాస ప్రాంతాల్లో వెయ్యి ఎకరాలు, కమర్షియల్ ప్రాంతంలో 300 గజాలు ఇస్తామని చెప్పారు.
* అసైన్డ్ భూములు అయితే 800 గజాలు, వాణిజ్య ప్రాంతంలో 200 గజాల భూమి కేటాయిస్తామని ప్రకటించారు.
* మెట్ట భూమిలో ఎకరాకు ఏటా రూ.300వేలు పరిహారం, జరీబు భూములకు ఏటా రూ.50వేలు పరిహారం అందిస్తామన్నారు.
* ఎక్కడ భూమి తీసుకుంటే అదే జోన్ లో భూ కేటాయింపుతో పాటు మెట్ట రైతుకు మెట్ట భూమి, జరీబు రైతుకు జరీబు భూమి ఇస్తామన్నారు.
* భూ సేకరణ ప్రాంత రైతులందరికి ఒకేసారి రుణమాఫీ వర్తిసతుందని చెప్పారు.
* పరిహార భూములు కేటాయించే ముందుగా మౌళిక వసతులతో అభివృద్ధి చేస్తామన్నారు.
* నిమ్మ, సపోట, జామ తోటల రైతలకు ఎకరాకు రూ. 50వేలు అదనపు పరిహారం అందిస్తామని ప్రకటించారు.
* ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండేలా ప్యాకేజి ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
* మొత్తం 12వేల కుటుంబాలకు పరిహారంతో పాటు ఇళ్ళు లేని వారు, రహదారుల విస్తరణలో భూములు కోల్పోయే వారికి ఇళ్లు కట్టిస్తామన్నారు.
* భూ సేకరణ ప్రాంతంలో ఉచిత విద్య, వైద్యం.
* భూములు కోల్పోయిన రైతులకు డబ్బులు ఉంటే పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు శిక్షణ, సాయం చేస్తామన్నారు.
* శ్మశానాలు, ప్రార్ధనా స్థలాలకు ప్రాధాన్యమిస్తూ.., దేవాదాయ శాఖ భూములు తీసుకుంటే దేవాలయాలకే భూములు ఇస్తామని చెప్పారు.

ఇలా ఆకర్షణీయమైన పరిహారం ప్రకటించిన ఏపీ సీఎం.., సోమవారం నుంచి రాజధాని భూ సమీకరణ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమానికి రైతులంతా సహకరించాలన్నారు. వీలైనంత త్వరగా అత్యుత్తమ రాజధాని నిర్మించుకుంటామన్నారు. అయితే పరిహారం ఎప్పటిలోపు ఇస్తారు అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. అంతేకాకుండా పరిహార మొత్తాన్ని ఎన్ని సంవత్సరాల పాటు ఇస్తారనే అంశంపై కూడా స్పష్టత ఇవ్వలేదు. ఈ ప్యాకేజి అంతా అరచేతిలో స్వర్గం చూపించినట్లుగా ఉందని రాజకీయ నేతలు విమర్శిస్తున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu statement  ap capital package  ap land pooling  

Other Articles