Pm narendra modi meets chief ministers in delhi mamata banerjee omar abdullah skip meeting

Prime Minister Narendra Modi, PM narendra modi, modi meeting of Chief Ministers, Pm meet with chief ministers, Planning Commission,. Jammu and Kashmir CM Omar Abdullah, West Bengal Chief Minister Mamata Banerjee, Mamata, Omar Abdullah Skip Meeting

Prime Minister Narendra Modi is chairing a meeting of Chief Ministers in the national capital to discuss the structure, scope and role of the new body that will replace the Planning Commission. Jammu and Kashmir Chief Minister Omar Abdullah and West Bengal Chief Minister Mamata Banerjee are skipping the meeting.

రాష్ట్రాలను కాదని దేశం ఎలా అభివృద్ది చెందుతుంది..?

Posted: 12/07/2014 08:23 PM IST
Pm narendra modi meets chief ministers in delhi mamata banerjee omar abdullah skip meeting

రాష్ట్రాలు అభివృద్ది చెందకుండా దేశం అభివృద్ది సాధించలేదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. తన నివాసంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులతో దేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో ముఖ్యమంత్రుల మండలిని తీసుకురాలని, దాని నిర్మాణం, పరిధి, ప్రాత ఎలా వుండాలన్న అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... దేశానికి అవసరమైన విధానాలు రూపొందించేలా వ్యవస్థ ఉండాలని అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా నూతన ప్రణాళికలు ఉండాలని తెలిపారు. రాష్ట్రాలు అభివృద్ధి కానిదే దేశాభివృద్ధి సాధ్యం కాదన్నారు. ప్రణాళిక విధానంలో కింది నుంచి పైస్థాయి వరకు మార్పు రావాలని ఆకాంక్షించారు. ప్రణాళికా సంఘం స్థానంలో సుస్థిరమైన సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవశ్యకతను మోదీ ఈ సందర్భంగా వివరించారు.

ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటుపై మోదీ తన నివాసంలో ఆదివారం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో సమావేశమైయ్యారు.  ప్రణాళికా సంఘం స్థానంలో కొత్త సంస్థ ఏర్పాటుపై వారితో మోదీ చర్చించారు. ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శుల సలహాలు, సూచనలను మోడీ పరిగణలోకి తీసుకున్నారు. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. శాసన సభ ఎన్నికల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్ సీఎంలు ఈ సమావేశానికి హాజరుకాలేదు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Chief Ministers  Planning Commission.  

Other Articles