Nasa successfully tests revolutionary shapeshifting aircraft wings for 1st time ever

NASA, Shape changing aircraft flap, NASA's green aviation project, ACTE, Edwards Air Force Base, California

NASA successfully tests 'revolutionary shapeshifting' aircraft wings for 1st time ever

గ్రీన్ ఏవియేషన్ కు బీజం నాటిని నాసా.. ప్రయోగం సక్సెస్..

Posted: 11/11/2014 12:00 AM IST
Nasa successfully tests revolutionary shapeshifting aircraft wings for 1st time ever

విప్లవాత్మక రీతిలో రెక్కల ఆకృతిని మార్చుకునే విమానాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) విజయవంతంగా పరీక్షించింది. గ్రీన్ ఏవియేషన్ లో భాగంగా రూపొందించిన ఈ ఎయిర్ క్రాప్ట్ పరీక్ష విజయం కావడంతో అమెరికా ముందడుగును ముందుకేసింది. తేలికగా, నిశ్శబ్దంగా ప్రయాణించే ఈ విమానం ఇంధనాన్ని కూడా పోదుపుగా వాడుకుంటుందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ ప్రాజెక్టు పేరు అడాప్టివ్ కాంప్లియెంట్ ట్రైలింగ్ ఎడ్జ్ (ఏసీటీఈ). దీన్ని నాసాతోపాటు అమెరికా వైమానిక దళ ప్రయోగశాల సంయుక్తంగా చేపట్టాయి. దీంతో భావితరాల విమానాలు శబ్దకాలుష్యం, వాయు కాలుష్య రహితంగా నడిచేట్టుగా విమానాన్ని రూపొందించామన్నారు.

విమానంలో సంప్రదాయ అల్యూమినియం ఫ్లాప్స్‌ను తొలగించి ఆకృతిని మార్చుకునే విడిభాగాలను ఏర్పాటు చేశారు. ఫలితంగా ఎప్పటికప్పుడు వంపు, మెలి తిరిగే ఉపరితలాలు ఏర్పడ్డాయి. వీటి వల్ల ఏరోడైనమిక్ సామర్థ్యం మెరుగుపడతోందని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో తలెత్తే భారీ ధ్వని తగ్గుతుందా అన్నది పరిశోధకులు నిర్ధరించదలిచారు. ఏసీటీఈ పరిజ్ఞానం.. భవిష్యత్‌లో వైమానిక రంగంపై పెను ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. తొలి పరీక్ష అనుకున్న రీతిలోనే సాఫీగా సాగిందని ప్రాజెక్టు మేనేజర్ థామస్ రిగ్నీ చెప్పారు.

ఈ సందర్భంగా అనేక కీలక అంశాలను పరీక్షించామని తెలిపారు. ఈ పరిజ్ఞానం కారణంగా భవిష్యత్‌లో విమానాలు మరింత తేలిగ్గా, భారీ శబ్దాలు చేయకుండా, ఇంధనాన్ని పొదుపు చేసేలా ఉంటాయని చెప్పారు. దీనివల్ల ఏటా ఇంధనం ఖర్చుల రూపేణా భారీగా సొమ్ము ఆదా అవుతుందని వివరించారు. కాలిఫోర్నియాలోని ఎడర్డ్స్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేస్ లో గల అమ్ స్ట్రాంగ్ ఫ్లైట్ రీసర్చ్ కేంద్రంలో దీనిని విజయంతంగా పరీక్షించినట్లు చెప్పారు. ప్రాజెక్టు సీఈఓ శ్రీధర్ కోటా మాట్లాడుతూ.. గల్స్ స్టీమ్ తో పరీక్షించిన తరువాత విమానం డిజైన్ యోగ్యతపై నిర్థారణకు రావచ్చునని చెప్పారు. అప్పుడే భవిష్యత్తు అప్లికేషన్లు, వ్యాపారీకరణకు అంగీకారాలు కుదుర్చుకోవచ్చునని చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles