వాడికి పొద్దస్తమానం ఫోన్ వుంటే చాలు. అకలి నిద్ర కూడా అక్కర్లేదు అంటూ ఇంట్లో పెద్దవాళ్లు పిల్లల్ని మందలించేవారు. అ తరువాత.... ఎప్పడు ఫోన్ మాట్లాడితే.. దాని రేడియేషన్ తో బ్రెయిన్ క్యాన్సర్ తదితర వ్యాధులు వస్తాయట. ఫోన్ చేసామా, మాటాడామా, కట్టేసామా అన్నట్టుండాలి తప్ప.. గంటలకోద్ది ఫోన్ లొ మాట్లాడకూడదు అంటూ ఇంట్లో మొగవారు..ఆడవారిపై కసురుకునే సన్నివేశాలను ఇళ్లల్లోనూ, చిత్రాలు, సీరియల్ లలోనూ చూస్తున్నాం. అయితే ఇక మీదట మీరు ఎంతసేపైనా ఫోన్ లో హాయిగా ముచ్చట్లు ఆడోచ్చు.. ఎందుకంటారా..?
,మొబైల్ ఫోన్ల రేడియేషన్ వల్ల మనుషుల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పూ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక అధ్యయనాల ప్రకారం.. సెల్ఫోన్ల నుంచి ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతున్నట్లు ఎక్కడా, ఎలాంటి ఆధారాలూ లభించలేదని డబ్ల్యూహెచ్ఓ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మొబైల్ ఫోన్ల వల్ల కేన్సర్ వస్తుందంటూ అనేక దేశాలలో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భయాలను దూరం చేసేందుకే ఈ ప్రకటన చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
దీర్ఘకాలికంగా, తాత్కాలికంగా సెల్ఫోన్ల వాడటం వల్ల మనిషి శరీరంపై తీవ్ర దుష్ర్పభావాలు కలుగుతున్నట్లుగా తమ అధ్యయనంలో వెల్లడికాలేదని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 690 కోట్ల మొబైల్ఫోన్లు వినియోగంలో ఉన్నాయని, ప్రధానంగా మొబైల్ రేడియేషన్ వల్ల శరీర కణజాలం వేడెక్కుతున్న మాట వాస్తవమేనని తెలిసింది. అయితే ఈ రేడియేషన్ వల్ల మెదడు, గుండె సహా ఇతర అవయవాలపై దుష్ర్పభావాలు కలిగించేంత స్థాయిలో ఫ్రీక్వెన్సీలు ఉండవని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. మెదడు, గుండె పనితీరు, నిద్ర, బీపీ వంటివాటిపైనా ఎలాంటి దుష్ర్పభావాలు కలగడం లేదని స్పష్టం చేసింది. ఇంకేంటి హ్యాపీగా ఫోన్ మాట్లాడండి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more