Gay couple to become fathers to three babies with surrogacy

gay couple, gay families, gay sex relationship, lesbian sex families, gay lesbian marriages, gay babies, gay couple babies, surrogacy mothers, surrogacy pregnancy type procedure, surrogacy mothers address contact, latest news

Gay couple to become fathers to three babies with surrogacy : Gay couple to become fathers to three babies in just seven months after meeting three different surrogate mothers

ముగ్గురు పిల్లలకు పేరంట్స్ అవుతున్న గే దంపతులు

Posted: 11/11/2014 01:00 AM IST
Gay couple to become fathers to three babies with surrogacy

టెక్నాలజితోపాటు మనుషుల మనస్సులు, ప్రవర్తన, ఆలోచనలు కూడా వేగంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఆడ, మగ పెళ్లి చేసుకునేవారు. కాని ఇప్పుడు ఇద్దరు ఆడాళ్లు కలిసి పెళ్ళి చేసుకుని సంసార జీవితం సాగిస్తున్నారు. అటు ఇద్దరు మగరాయుళ్లు కూడా దర్జాగా పెళ్లి చేసుకుని ఒక్కటవుతున్నారు. వీరికి చట్టాలు కూడా కలిసి ఉండేందుకు అనుమతి ఇస్తున్నాయి. ఇక వీరికి పిల్లలు పుట్టాలంటే ఎలా.., పిల్లలు కావాలన్న కోరికను తీర్చుకోవటం ఎలా అన్న ఆలోచన వచ్చిన గే దంపతులు డార్లి లీ (41), ల్యూక్ హ్యారిస్ (50)కి ఓ ఉపాయం తట్టింది. అనుకన్న వెంటనే కలిశారు.., ఫలితంగా ముగ్గురు పిల్లలకు పేరంట్స్ కాబోతున్నారు.

కలవటం అంటే మరోలా అనుకోకండి. వీరు కలిసింది ఆన్ లైన్ లో తల్లులను కలిశారు. అంటే వీరిద్దరూ సరోగసి పద్దతి ద్వారా పిల్లలకు పేరంట్స్ కాబోతున్నారు. 2012 నుంచి సంసారం చేస్తున్న వీరికి పిల్లలు లేరు అనే లోటు స్పష్టంగా తెలిసిందట.     వెంటనే సరోగసి ద్వారా పిల్లల్ని కని ఇచ్చే తల్లులను ఆన్ లైన్ ద్వారా కలిశారు. అలా ముగ్గురు మహిళలు ముందుకు వచ్చారు. ఇద్దరు బిడ్డలు ల్యూక్ జన్యువుల నుంచి పుడుతుండగా.., ఒక శిశువు హ్యరి జన్యువుల నుంచి జన్మించనుంది. ఈ ముగ్గురు శిశువులు ఒకరి తర్వాత ఒకరుగా నెలల వ్యవధిలో జనవరి నుంచి జులై మద్య జన్మించనున్నారు.

ఇదంతా వినటానికి బాగానే ఉంది. కాని పిల్లలు పుట్టాక వారి పరిస్థితి ఏమిటి. శిశువులకు ఎవరు పాలు పడతారు.. ఎవరు జోలపాడతారు, ఎవరు చూసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇంతా చేసిన వీరికి పనిమనుషుల్ని పెట్టి ఈ పనులు చేయించటం పెద్ద విషయమా అనుకోవచ్చు. కాని పిల్లలు పెరిగి పెద్దయ్యాక, ల్యూక్, హ్యారిల్లో ఎవరిని అమ్మ అని పిలవాలి, ఎవరిని నాన్న అని పిలవాలి. ఏమోలే ఇప్పుడిదంతా ఎందుకు కానీ.. ముందుగా ఈ గే దంపతులకు అడ్వాన్స్ గా శుభాకాంక్షలు చెప్పేద్దాం.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gay  babies  surrogacy  latest news  

Other Articles