Clinical india thrash sri lanka by six wickets seal series

India, Sri Lanka, India vs Sri Lanka 2014, Virat Kohli, Shikhar Dhawan, Mahela Jayawardene, Umesh Yadav, ODI series, cricket news

Clinical India thrash Sri Lanka by six wickets, seal series

హట్రిక్ విజయంతో సీరిస్ కైవసం చేసుకున్న భారత్

Posted: 11/10/2014 10:22 AM IST
Clinical india thrash sri lanka by six wickets seal series

భారత్, శ్రీలంకల మధ్య జరిగిన మైక్రోమాక్స్ సిరీస్‌ను భారత్ తన మెరుగైన ప్రదర్శనతో కైవసం చేసుకుంది. ఐదు వన్డేల సీరీస్ లో వరుసగా మొదటి మూడు వన్డేలను గెలుచుకుని హాట్రిక్ విజయం సాధించిన భారత్.. మరో రెండు మ్యాచ్ లు మిగిలివుండగానే సీరీస్ ను సోంతం చేసుకుంది. హైదరాబాద్‌ ఉప్పల్ స్టేడియంలో జరిగిన వన్డేలో భారత్ 44.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఐదు ఓవర్ల ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 242 పరుగులకు ఆలౌట్ అయింది. జయవర్దనే సెంచరీ మినహా మిగతా ఆటగాళ్లలందరూ పేలవ ప్రదర్శన ఇవ్వడంతో శ్రీలంక ఘోర పరాజయాన్ని చవిచూసింది. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ అలవోకగా సాధించింది. రహానే, ధావన్ వేసిన గట్టి పునాదిని తర్వాత వచ్చిన అంబటి రాయుడు, కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనసాగించడంతో భారత్ విజయం సులభమైంది.

మొదటి రెండు మ్యాచ్‌ల్లోలాగానే శిఖర్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగించి 78 బంతుల్లో 91 పరుగులు సాధించి కొద్దిలో సెంచరీని కోల్పోయాడు. అయితే శిఖర్ ఔట్ అయిన తీరు కొంత వివాదాస్పదంగా ఉంది. కులశేఖర సంధించిన ఓవర్ పిచ్ బంతి శిఖర్ హెల్మెట్‌ను తాకి కీపర్ చేతిలోకి వెళ్లినట్లు కన్పించింది. అయితే అంపైర్ బ్యాట్‌ను తాకి వెళ్లినట్లు నిర్ధారించి ఔట్ ఇచ్చాడు. శిఖర్ తన రెండో సెంచరీని కోల్పోవటం కొంత విషాదాన్ని మిగిల్చినా.. అయన రెండు వేల పరుగుల క్లబ్ లో చేరటం సంతోషాన్నిచ్చింది.. విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీ సాధించడంతోపాటు 6 వేల పరుగుల క్లబ్‌లో చేరటం అభిమానులకి ఆనందాన్ని ఇచ్చింది. చివర్లో విరాట్ ఔట్‌కావడంతో క్రీజ్‌లోకి వచ్చిన వృద్ధిమాన్ సాహా 45 ఓవర్ మొదటి బంతిని బౌండరీకి తరలించడం ద్వారా భారత్‌ని విజయతీరాలకు చేర్చారు.

మ్యాచ్ మొత్తం మీద శ్రీలంక ఏదశలోనూ భారత్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. భారత్ సిరీస్ నుంచి వెస్టిండీస్ అర్థాంతరంగా వైదొలగడంతో ఆగమేఘాలమీద బీసీసీఐ శ్రీలంకతో సిరీస్ ఖాయం చేసింది. అయితే ప్రారంభంలోనే తాము శారీరకంగానూ, మానసికంగానూ ఈ సిరీస్‌కు సిద్ధంగా లేమని శ్రీలంక ఆటగాళ్లు ప్రకటించారు. దీనికి తగ్గుట్టుగానే వారు మూడు మ్యాచ్‌ల్లో పేలవమైన ఆటతీరును ప్రదర్శించారు. సీనియర్ ఆటగాడు సంగక్కర ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఫామ్‌ను కొనసాగించలేకపోవడటం శ్రీలంకకు ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. మూడో మ్యాచ్‌లో జయవర్దనే సెంచరీ చేయడం కలిసొచ్చిన విషయం. కెప్టెన్ కోహ్లీ తన బ్యాటింగ్‌తోపాటు కెప్టెన్సీలో కూడా రాణించటం శుభపరిణామం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles