21 mp s sworn in as ministers in prime minister narendra modi cabinet

Prime Minister, Narendra Modi, Bandaru Dattatreya, BJP, MP, TDP, RajyaSabha, RJD, Shivsena, Srujana chowdary, jp nadda, suresh Prabhu, cabinet rank, independent charge, union ministers for state

21 MP's sworn in as ministers in Prime Minister Narendra Modi cabinet

ప్రధాని మోడీ క్యాబినెట్లో కొలువుదీరిన కోత్తమంత్రులు

Posted: 11/09/2014 05:10 PM IST
21 mp s sworn in as ministers in prime minister narendra modi cabinet

కేంద్ర కేబినెట్ విస్తరణ ముగిసింది. ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ లోకి 21 మంది ఎంపీలు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి కార్యాలయంలోని దర్బార్ హాలులో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్య్రమానికి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోడీ, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపి సీనియర్ నాయకుడు ఎల్కే అద్వాని, కేంద్రమంత్రులు సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు, ప్రకాష్ జావదేకర్, నిర్మలా సీతారామన్, సహా ఇతర మంత్రలు, పలు మిత్రపక్షాలకు చెందిన నేతలు, అధినేతలు, హజారయ్యారు.

సరిగ్గా ఒంటిగంటలకు మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమైంది. నరేంద్రమోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారిగా జరిగిన మంత్రివర్గ విస్తరణ ఇదే. ముందునుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో సరిగ్గా 21 మంది నూతనంగా తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు మోడీ. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 21 మంది ఎంపీల చేత ప్రమాణ స్వీకరాంచేయించారు. కేబినెట్ మంత్రులుగా నలుగరు, స్వతంత్రహోదా కలిగిన మంత్రులుగా ముగ్గురు, సహాయ మంత్రులుగా 14 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విస్తరణతో కేంద్రమంత్రివర్గ సభ్యుల సంఖ్య 66కు చేరింది.

నలుగురు క్యాబినెట్ హోదా మంత్రులు వీరే

గోవా తాజామాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ క్యాబినెట్ హోదా మంత్రిగా ప్రమాణస్వీకరాం చేశారు. మనోహర్ పారికర్ కు దేశ రక్షణ శాఖను కట్టబెట్టనున్నట్లు జాతీయ మీడియాలో రెండు రోజుల ముందునుంచే వార్తలు వెలువడ్డాయి. మరోవిధంగా చెప్పాలంటే.. పారికర్ కు కేంద్ర రక్షణ శాఖా మంత్రిగా అపాయింట్ చేస్తున్నారన్న వార్తతో కేంద్రం మంత్రివర్గ విస్తరణ పునర్ వ్యవస్థీకరణ జరుగుతుందని వార్తలు వచ్చాయి. పారికర్ తో పాటు శివసేనకు చెందిన సురేష్ ప్రభాకర్ ప్రభు కూడా క్యాబినెట్ హెదాలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజంపూర్ నుంచి ఎంపీగా ఎన్నకైన ఆయన గతంలో అటల్ బీహారీ వాజ్ పాయ్ క్యాబినెట్ లోనూ మంత్రిగా పనిచేశారు. ఈయనతో పాటు రాజ్యసభ సభ్యుడు, బీజేపి సీనియర్ నేత, బీజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ నడ్డా. కూడా క్యాబినెట్ హెదా దక్కింది. నడ్డా 2012లో రాజ్యసభకు ఎంపికయ్యారు. వీరితో పాటు హర్యానా జాట్ నేతగా గుర్తింపు తెచ్చుకున్న నేతల్లో ఒకరు, 42 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో కొనసాగి.. ఇటీవలే బీజేపిలో చేరి.. ఎంపీగా గెలిచిన బీరేంద్ర సింగ్ కు కూడా క్యాబినెట్ హోదా దక్కింది.

ముగ్గురికి స్వతంత్ర హోదా

తెలంగాణ నుంచి గెలిచిన ఏకైక బీజేపి ఎంపీ, సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తత్రేయకు మరోమారు స్వతంత్ర హోదాలో క్యాబినెట్ పదవి లభించింది. అటల్ బిహారీ వాజ్ పాయ్ క్యాబినెట్ లో కేంద్ర సహాయ మంత్రిగా, స్వతంత్ర హోదా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయనకు మరోమారు స్వతంత్ర హోదాలో మంత్రి పదవి లభించింది. గతంలో దత్తాత్రేయ పట్టణాభివృద్ది, కేంద్ర రైల్వే శాఖల సహాయమంత్రిగా , తరువాత స్వత్రంత హోదాలో పట్టణాభివృద్ది శాఖా మంత్రిగా బాధ్యతల నిర్వహించారు. బండారుతో పాటు బీజేపీ అధికార ప్రతినిధిగా, బీహార్ సరన్ నియోజకవర్గం నుంచి లోక్ సభకు ఎన్నికైన రాజీవ్ ప్రతాప్ రూడీకి కూడా స్వతంత్ర హోదాలో మోడీ క్యాబినెట్ లో స్థానం దక్కింది. 1996లో తొలిసారిగా ఎంపీగా ఎన్నిక, వాజ్పాయ్ క్యాబినెట్ లో సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వీరితో పాటు ఉత్తర్ ప్రదేశ్ లోని గౌతమ్ బుద్దనగర్ నుంచి ఎంపీగా గెలిచిన డాక్టర్ మహేష్ శర్మకు కూడా ప్రధాని మోడీ క్యాబినెట్ లో స్వతంత్ర హోదాలో స్థానం లభించింది.

14 మంది కేంద్ర సహాయ మంత్రులు వీరే..

ఉత్తర్ ప్రదేశ్ రామ్ పూర్ నుంచి లోక్ సభకు ఎన్నికైన బీజేపి ఎంపీ, వాజ్ పాయ్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ,  బీహర్ ఆర్జేడీ నేతగా ప్రాచూర్యం పొంది మోడీ రాకతో బీజేపిలో చేరిన రాంకృఫాల్ యాదవ్ కూడా మంత్రి పదవి లభించింది. బీహార్ లోని పటలీపుత్ర నియోజకవర్గం నుంచి గెలిచిన ఈయన లాలూ ప్రసాద్ యాదవ్ కూతురుపై ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపోందారు. వీరితో పాటు రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ కల్నల్ సోనారామ్ చౌదరి,  రాజస్థాన్ కు చెందిన సన్వర్ లాల్ జాట్, గుజరాత్ కు చెందిన మోహన్ కుందారియా, ఇటీవల బీజేపిలో చేరి, బీహార్ సవాడ నియోజవర్గం నుంచి గెలుపోంది, గతంలో నితిష్ కుమార్ క్యాబినెట్ లో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన గిరిరాజ్ సింగ్ కు కూడా కేంద్ర సహాయ మంత్రిగా పదవి లభించింది.  మహారాష్ట్ర చంద్రపూర్ నుంచి లోక్ సభకు ఎన్నిక బీజేపి ఎంపీ హన్స్ రాజ్ అహిర్, ఫ్రోపెసర్ రామ్ శంకర్ కటేరియాలకు కేంద్ర సహాయ మంత్రిగా పదవి దక్కింది.

వీరితో పాటు తొలిసారిగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామిక వేత్త సుజనా చౌదరికి కూడా కేంద్ర సహాయ మంత్రి పదవి లభించింది. ఆయనతో పాటు జార్ఖండ్ నుంచి ఎంపీగా తొలిసారి గెలిచిన జయంత్ సిన్హాకు కూడా కేంద్ర సహాయ మంత్రి పదవి వరించించి. ఈయన సీనియర్ నేత యశ్వంత్ సిన్హా కుమారుడు. ఈయనతో రాజస్థాన్ కు చెందిన రాజ్యవర్దన్ సింగ్ రాథోడ్, పశ్ఛిమ బెంగాల్ కు చెందిన బాబుల్ సుప్రియో, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన సాధ్వీ నిరంజన్ జ్యోతి, పంజాబ్ కు చెందిన విజయ్ సంప్లాలకు కూడా కేంద్ర సహాయ మంత్రులుగా పదవులు లభించాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles