Kiss of love uppal as kcr kisses ambati rayudu hand and virat gives fling kiss after half century

ambati rayudu, team india, srilanka, thirde one day, kcr, Telangana chief minister, virat kohli, anushka sharma, half century, HCA

kiss of love@uppal as Kcr kisses ambati rayudu hand, and virat gives fling kiss after half century

ఉప్పల్ స్టేడియానికి పాకిన కిస్ ఆఫ్ లవ్..

Posted: 11/10/2014 10:24 AM IST
Kiss of love uppal as kcr kisses ambati rayudu hand and virat gives fling kiss after half century

ఉప్పల్ స్టేడియానికి కిస్ ఆప్ లవ్ పాకింది. ఇద్దరు సెలబ్రిటీలు మరో ఇద్దరి సెలబ్రీటీలను ఉప్పల్ స్టేడియం వేదికగా కిస్ చేసి సంచలనం రేకెత్తించారు. ఇందుకు ఉప్పల్ లో క్రికెట్ అభిమానులు సాక్షులుగా నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి, ఉద్యమ సారధి ఏదీ చేసినా కొంత వైవిధ్యంగానే వుంటుంది. ఆయన అభిమానాన్ని తట్టుకోవడం కూడా కొంచెం ఇబ్బందికరంగానే వుంటుంది. ఇది  ప్రస్తుత టీమిండియా ఆటగాడు, హైదరాబాద్ మాజీ ఆటగాడు అంబటి రాయుడికి ఎదురైంది. అంబటి రాయుడిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పద్ధతిలో పలకరించారు. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా  హాజరైన కేసీఆర్ .. ముందుగా ఇరు జట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకున్నారు. అయితే ఆటగాళ్ల అందర్నీ కరచాలనంతో పరిచయం చేసుకున్న కేసీఆర్.. రాయుడి చేతిని మాత్రం దగ్గరకు తీసుకుని ముద్దాడారు.
 
ప్రస్తుతం బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయుడు.. గతంలో హైదరాబాద్ జట్టు తరపున ఐపీఎల్ లో ఆడాడు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ రాయుడిని ప్రత్యేక పద్ధతిలో పరిచయం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాజధాని హైదరాబాద్ లో జరిగే తొలి వన్డే మ్యాచ్ కావడంతో కేసీఆర్ ను ఆహ్వానించిన హెచ్ సీఏ పెద్దలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అయితే అందరి సహచర మిత్రుల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి తనను ప్రత్యేకంగా పలకరించడం రాయుడు కొంత ఇబ్బందికరంగానే ఫీలయ్యారు.

ఇక సాయంత్రానికి నిజంగానే లవర్స్ కిస్ ఆప్ లవ్ అవిష్కరించింది. భారత ఇన్నింగ్స్ సమయానికి కోహ్లి గర్ల్‌ఫ్రెండ్, సినీనటి అనుష్క శర్మ స్టేడియానికి వచ్చింది. క్రికెట్ ఆడుతున్నంత సేపూ ఏ మాత్రం ఖాళీ దొరికినా అనుష్కను చూసిన విరాట్... అర్ధసెంచరీ పూర్తి కాగానే గర్ల్‌ఫ్రెండ్‌కు బ్యాట్‌తో కిస్ కొట్టాడు. దీనికి అనుష్క కూడా స్పందించి సిగ్గుపడుతూ మురిసింది. దీంతో స్టేడియానికి వచ్చిన లవర్స్ కూడా పనిలో పనిగా కిస్ ఇచ్చుకున్నారట.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles