Islamic state recruiting thousands from tribal areas of pakistan warns balochistan government in confidential report

Lashkar-e-Jhangvi,, Islamic State (IS), North Waziristan, Balochistan, Pakistan, Militant, attack, Islamic State, Waziristan, federal government

Islamic State recruiting thousands from tribal areas of Pakistan, warns Balochistan government in confidential report

పాకిస్థాన్ లో ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద రిక్రూట్ మెంట్...

Posted: 11/09/2014 05:07 PM IST
Islamic state recruiting thousands from tribal areas of pakistan warns balochistan government in confidential report

పాకిస్థాన్ తివ్రవాద దేశంగా క్రమంగా మారుతోంది. ఇప్పటికే తాలిబన్ టెరరిస్టు దళాలు పాకిస్థాన్ లోని అనేక ప్రాంతాల్లో పట్టు సాధించగా, చాపకింద నీరులా ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) తీవ్రవాదం కూడా క్రమంగా పాకిస్థాన్ లో వేళ్లూనుకుంటోంది. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ నుంచి ముప్పు పెరుగుతోందంటూ పాకిస్థాన్ భద్రతా దళాలు ఆ దేశ ప్రభుత్వాన్ని హెచ్చరించినట్లు ఓ మీడియా నివేదిక వెల్లడించింది. హంగూ జిల్లాలోని ఖైబర్ పక్తుంక్వా, కుర్రం గిరిజన జిల్లాలనుంచి పదివేల నుంచి పన్నెండు వేల మంది అనుచరులను ఐఎస్ నియమించుకుందని అక్టోబరు 31న ''ద డాన్'' తన వెబ్‌సైట్‌లో ''రహస్య సమాచార నివేదిక'' పేరున వెల్లడించింది.

మధ్య తూర్పు తీవ్రవాద సంస్థ (దాయిష్) కార్యక్రమాలు ఉద్ధృతమవుతున్నాయని హెచ్చరిస్తూ బలూచిస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తన నివేదికలో సమాఖ్య ప్రభుత్వానికి విషయాన్ని చేరవేసింది. హోం శాఖ తో పాటు బలుచిస్థాన్ ట్రైబల్ శాఖ నుంచి కూడా ఇస్లామిక్ తీవ్రవాదం విస్తరిస్తున్నట్లు నివేదిక పంపినట్టు తెలుస్తోంది. లష్కరే ఇ జాంగ్వీ సహా అల్ సున్నత్ వాయ్ జమత్ సంస్థలను తమకు సాయం చేయాల్సిందిగా ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ కోరినట్లు సమాచారం. ఇందుకు గాను వారికి పలు అంశాలలో ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ సహకారం అందించేందుకు ఒప్పందం చేసుకుందని కూడా తెలుస్తోంది.

ఉత్తర వజీరిస్థాన్ లోని  ఖైబర్ పక్తుంక్వాలో వున్న ప్రభుత్వ భవనాలు, సైన్యం స్థావరాలపై దాడులకు పాల్పడడానికి ఐఎస్ ప్రణాళికలు రచిస్తోందని, షియా మైనారిటీ వర్గాలను కూడా లక్ష్యంగా చేసుకొంటుందని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బలూచిస్థాన్ ప్రభుత్వం భద్రత, నిఘా కార్యక్రమాలను కట్టుదిట్టం చేసింది. ఐఎస్ ఇక్కడ ఉన్నట్లు ఇప్పటికీ అధికారికంగా వెల్లడి కాలేదు. అయితే తీవ్రవాద దాడులు చేస్తారన్న సమాచారంతో భద్రతను ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles