Telangana government to launch a new number for protection of women

Telangana Government, chief Minister, KCR, launch, new number, protection of women, Quick responce Teams, 181, 15 minutes, Women Police, GPS Vehicles, Police department.

Telangana Government to launch a new number for protection of women, officials say don't call Help, call 181 in need

మహిళలూ.. హెల్ఫ్ అని అనకండి.. 181కి కాల్ చేయండి..

Posted: 11/08/2014 06:22 PM IST
Telangana government to launch a new number for protection of women

మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనుంది. యువతులు.. మహిళలపై వేధింపులను (ఈవ్‌టీజింగ్) అడ్డుకునేందుకు 'షి' బృందాలను అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం కొత్తగా మహిళల కోసమే ప్రత్యేకంగా ''181'' టోల్‌ఫ్రీ నంబరును ప్రవేశపెట్టనుంది. నేరాలు, ఇతర అవసరాలకు డయల్ 100, అత్యవసర పరిస్థితులు, వైద్య అవసరాలకు 108 ఇప్పటికే ఉండగా.. వీటికన్నా అత్యాధునికంగా 181ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామంలో ఈ ప్రాజెక్టును రూపొందించనున్నారు. పోలీస్, రెవెన్యూ, వైద్యారోగ్యశాఖ ఇందులో భాగస్వామ్యులుగా ఉండనున్నాయి. 181 టోల్‌ఫ్రీ నంబరు వ్యవస్థను ప్రారంభించేందుకు ప్రాథమికంగా రూ.50కోట్లు అవసరమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా... వెంటనే పనులు ప్రారంభించమంటూ ఆదేశాలు జారీ చేయడంతో ఉన్నతాధికారులు ఇందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మహిళల కోసమే ప్రత్యేకంగా పనిచేసే 181 టోల్‌ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయగానే... సంఘటన స్థలానికి చేరుకునేందుకు సత్వర స్పందన బృందాలు(క్విక్ రెస్పాన్స్ టీం) ఉంటాయి. ఒక్కో బృందంలో ఒక మహిళా కానిస్టేబుల్, డ్రైవర్, మానసిక నిపుణులు ఉంటారు. వీరు వేగంగా స్పందించేందుకు జీపీఎస్ తరహా అత్యాధునిక హంగులున్న వాహనం ఉంటుంది. బాధితులు ఫోన్ చేసిన 15 నిమిషాల్లోనే అక్కడికి ఈ బృందం చేరుకుంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో విధులు నిర్వహించే వారు ఫోన్ చేస్తే... ఆయా కార్యాలయాలకు వెళ్లి అక్కడికక్కడే ఫిర్యాదులను స్వీకరించి చట్టపరంగా చర్యలు చేపట్టనున్నారు. వీటన్నింటినీ సమన్వయం చేసుకునేందుకు ఐటీ ఆధారిత పరిజ్ఞానంతో పనిచేయనున్న కార్పొరేట్ కార్యాలయాన్ని నిర్మించనున్నారు.

హైదరాబాద్... సైబరాబాద్‌లో ప్రయోగాత్మకం: వచ్చే మూడు నాలుగు నెలల్లో ''181'' వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి ఉన్నతాధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. దీన్ని హైదరాబాద్, సైబరాబాద్‌లలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు కమిషనరేట్ల పరిధిలో మహిళలపై నమోదవుతున్న నేరాలు వందల సంఖ్యలో ఉండడంతో ఈ నిర్ణయం తీసకున్నారు. ప్రతి జోన్‌కు 2 వాహనాల చొప్పున 20 సత్వర స్పందన బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ''181'' నంబరుకు వచ్చే ఫోన్ల సంఖ్య ఆధారంగా ఈ బృందాలను పెంచనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్‌లలో ఫోన్‌కాల్స్ ఆధారంగా స్పందించి చర్యలు చేపట్టేందుకు, పర్యవేక్షించే పనులను తాత్కాలికంగా హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్(నేరాలు) స్వాతిలక్రాకు అప్పగించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles