Foreign ladies land in jail after raiding hot air balloon

hot air balloon, foreign tourists, ajmeer jail, west indies, ajmeer, pushkar, balloon operator, released, prohibited area

foreign ladies land in jail after raiding hot air balloon

అజ్మీర్ జైలులో అకాశం నుంచి ఊడిపట్ట విదేశీ అతిదులు

Posted: 11/05/2014 05:37 PM IST
Foreign ladies land in jail after raiding hot air balloon

అది అజ్మీర్ జైలు.. ఇవాళ మధ్యాహ్నం అకస్మాత్తుగా ఇద్దరు అతిధులు జైలులోకి వచ్చారు. దీంతో కంగారు పడిన జైలు అధికారులు వీరెవరా అని ఆరా తీస్తే కానీ తెలియలేదు వారు వీదేశీ యువతులని. అందులోనూ వెస్టిండీస్ కు చెందిన వారని. అయితేనేం జైలుకు రావాలంటూ రాచమార్గం గుండా రావాలి గానీ, ఆకాశం నుంచి ఊడిపడటం ఏంటని అనుకుంటున్నారా..? ఈ అనుకోని అతిధులకు అధికారులు ఏలా మర్యాదలు చేశారని తెలసుకోవాలనుకుంటున్నారా..?

భారత దేశ పర్యటనకు వచ్చిన వెస్టీండీస్ పర్యాటకులు.. రాజస్థాన్ కు చేరుకున్నారు. రాజస్థాన్ అందాలను చూద్దామని వెళ్లిన ఇద్దరు విదేశీ మహిళా పర్యాటకులు జైలుపాలయ్యారు. హాట్ ఎయిర్ బెలూన్లో వెళ్దామనుకున్న సాహసం వారిని జైలుపాలు చేసింది. అయితే.. వాళ్లు అరెస్టు కాకుండానే జైలుకు వెళ్లడం ఇక్కడ విశేషం. అజ్మీర్లోని పుష్కర్ ప్రాంతం నుంచి హాట్ ఎయిర్ బెలూన్ వేసుకుని నగర సందర్శనకు వెళ్లారు. అయితే.. గాలి బాగా వేగంగా వీయడంతో దాని ఆపరేటర్ బెలూన్ మీద నియంత్రణ కోల్పోయారు. నేరుగా వెళ్లి అజ్మీర్ జైలు ప్రాంగణంలో బెలూన్ దిగింది.

ఆ సమయానికి ఖైదీలంతా బ్యారక్లలో ఉన్నారు. అయితే ఉన్నట్టుండి ఇలా బెలూన్ దిగడంతో జైలు అధికారులంతా ఒక్కసారిగా తత్తరపడ్డారు. అందులో ఉన్న ఇద్దరు మహిళలను సుమారు గంటపాటు ప్రశ్నించిన తర్వాత వారు చెబుతున్నదంతా నిజమని నిర్థారించుకున్న తరువాత అప్పుడు బయటకు పంపారు. దాంతో వాళ్లు బతుకు జీవుడా అనుకుంటూ జైపూర్ వెళ్లిపోయారు. నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించాడంటూ బెలూన్ ఆపరేటర్పై కేసు నమోదు చేసి, అతడి లైసెన్సు రద్దు చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles