Why central government not disclose all names of black money holders

why central government not disclose all names of black money holders, black money holders names, black money holders full list, black money holders amount, black money in india, latest news, nda government on black money, congress on black money

why central government not disclose all names of black money holders? : on monday dated 27-10-2014 central government revealed three black money holders name to supreme court there is doubt that why government not disclosed all names of black money holders

ముగ్గురి పేర్లే ఎందుకు విప్పారు... అన్ని చెప్పకపోవటానికి అసలు కారణం..?

Posted: 10/27/2014 05:10 PM IST
Why central government not disclose all names of black money holders

దేశాన్ని పట్టిపీడిస్తున్న నల్లధన వెలికతీత దిశగా కీలకమైన అడుగు పడిందనే చెప్పాలి. నల్ల కుభేరుల జాబితాను పొందిన కేంద్ర ప్రభుత్వం ముందుగా ముగ్గురి పేర్లను కోర్టుకు అఫిడవిట్ రూపంలో సమర్పించింది. వీరు... బర్మన్ గ్రూప్ డైరెక్టర్ ప్రదీప్ బర్మన్, రాజ్ కోట్ కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పంకజ్ చిమన్ లాల్, గోవాకు చెందిన రాధా ఎస్ టింబ్లో గా కోర్టుకు వెల్లడించింది. అయితే వీరు ముగ్గురు తమకు ఎలాంటి అక్రమార్జనలు లేవని ప్రకటించారు. విదేశాల్లో ఉన్న ఖాతాల్లో తమ కష్టార్జితమే ఉందని ప్రకటించారు.

అయితే ఇదంతా పక్కనబెడతే.., నల్లధన కుభేరులను బయటకు లాగుతామన్న ప్రభుత్వం అన్నంత పనీ చేస్తోంది. కాని ఇక్కడే చిన్న అంశంపై అంతా సందేహాలు వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం స్విస్ బ్యాంకు నుంచి మొత్తం 700మంది ఖాతాదారుల పేర్లు వచ్చాయి. వీటిలో కేవలం ముగ్గురి పేర్లను మాత్రమే సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించింది. మిగతా 697 మంది పేర్లను వెల్లడించాల్సి ఉంది. ఇలా దశల వారీగా చేసే బదులుగా మొత్తం ఒకసారి కోర్టుకు చెప్పేందుకు ఎందుకు వెనకాడుతున్నారు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి ఈ విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముగ్గురిని మాత్రమే ప్రకటించి.., మిగతా వారితో బేరసారాలు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

అటు నల్లధన కుబేరుల జాబితాను చేతిలో పెట్టుకుని బయటకు చెప్పకపోవటంపైనా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి చర్యలు నల్లధన అక్రమార్కులను సహకరించేందుకే అని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన ఎన్డీఏ ప్రభుత్వం, తాము అక్రమార్కులకు సహకరించే ప్రసక్తే లేదని వివరణ ఇస్తోంది. యూపీఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ద్వంద పన్ను ఎగవేత నిబంధనకు లోబడి అన్ని పేర్లు వెల్లడించలేకపోతున్నట్లు చెప్పింది. అయితే ప్రభుత్వానికి ఇది ఏమాత్రం అడ్డంకి అవుతుందని భావించటం లేదని విపక్షాలు, ప్రజా సంఘాలు చెప్తున్నాయి.

కాగా లిస్ట్ లోని మొత్తం పేర్లను వెల్లడించకపోవటానికి పలు ప్రభుత్వ, రాజకీయ కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. స్విస్ బ్యాంకుల నుంచి వచ్చిన జాబితాలో అక్రమంగా డబ్బు పోగేసిన వారితో పాటు.., సాధారణంగా సొంత సొమ్ము దాచుకున్న వారి పేర్లు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎవరు అక్రమంగా సంపాదించారు అనేది స్విస్ అధికారులకు ఎలా తెలుస్తుంది. కాబట్టి జాబితాలోని ఏడు వందల మంది బాగోతంపై అంతర్గతంగా విచారించుకుని.., వారి నగదు లావాదేవీలు, పన్ను చెల్లింపులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని, జాబితాలో ఉన్నవారు నిబంధనలు అతిక్రమించినట్లు నిరూపణ అయితేనే వారి పేర్లను కోర్టుకు వెల్లడించనుంది. దీనికి తోడు మరో కారణం ఏమిటంటే దేశాన్ని పట్టిపీడిస్తున్న ఈ అంశంను వెంటనే చెప్పేస్తే ప్రభుత్వానికి లాభం ఉండదు. కాబట్టి.. జాబితాను నిదానంగా.. దశల వారిగా విడుదల చేసుకుంటూ పోతే ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఈ వాదనల్లో వాస్తవాలు ఎంతవరకు అనేది ఎవరూ చెప్పలేరు. మొత్తానికి యూపీఏ చేయలేని పని ఎన్డీఏ చేసినందుకు సంతోషించాలి.. సర్కారును మెచ్చుకోవాలి. అయితే ఈ జాబితాను త్వరగా వెల్లడిస్తే... దేశానికి పట్టిన దరిద్రం త్వరగా వదిలిపోతుంది అనే విషయం గుర్తుంచుకుంటే మంచిది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : black money  list  central government  superme court  

Other Articles