Kerala lovers to protest by kisses and hugs

kerala lovers protest, attack on kerala lovers, yuvamorcha attack on lovers, kerala yuva morcha, kerala latest news, yuva morcha attacks, kerala beauties, kerala tourism, funny protests, variety protests

kerala lovers to protest by kisses and hugs : lovers in kerala angry on yuva morcha activists attack on lovers in a hotel. lovers decided to protest against yuva morcha activists attack with kisses and hugs

విడ్డూరం : ముద్దులు, కౌగిలింతలతో నిరసనట

Posted: 10/27/2014 04:26 PM IST
Kerala lovers to protest by kisses and hugs

మన దేశంపై పాశ్చ్యాత్య ప్రభావం బాగానే ఉంది. వస్ర్తాలంకరణలోనే, వేషాధారణలోనే కాకుండా ఇప్పుడు నిరసనలు తెలపటంలోనూ విదేశీ సంస్కృతిని మనవారు పాటిస్తున్నారు. కేరళలో ప్రేమికులు వెరైటీగా ముద్దులు, గట్టిగా కౌగిలింతలతో నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 2న ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. కేరళలో ప్రేమికులపై జరుగుతున్న దాడులకు నిరసనగానే ఇలా వినూత్నంగా నిరసన తెలుపుతున్నట్లు చెప్పారు.

వివాదానికి గల కారణం చూస్తే... మోరల్ పోలిసింగ్ పేరుతో కోజికోడ్ లో యువమోర్చా కార్యకర్తలు ఓ రెస్టారెంట్ లో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో అక్టోబర్ 23న ఓ రెస్టారెంట్ లోని ప్రేమికులపై దాడికి దిగారు. ఈ ఘటనలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు యవమోర్చా కార్యకర్తలను పోలిసులు అరెస్టు చేశారు. అటు తమపై జరిగిన దాడిపై ప్రేమికులు గుస్సామీద ఉన్నారు. ప్రేమ పవర్ ఏంటో చూపిస్తామంటూ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధం అవుతున్నారు.

ఈ ముద్దులు, కౌగిలింతల నిరసన కార్యక్రమంలో ప్రేమికులంతా జంటలుగా పాల్గొనాలని కోరారు. ఇక తమ నిరసనకు విస్రృత ప్రచారం కల్పించేందుకు ఫేస్ బుక్ లో ప్రత్యేకంగా పేజిని కూడా ప్రారంభించారు. ప్రపంచ ప్రేమికులారా ఏకకండి అని అప్పట్లో నినదిస్తే.. ఇప్పుడు కేరళ ప్రేమికులారా కదలిరండి అని పిలుపునిస్తున్నారు. అయితే ఈ ఆందోళనలపై ధార్మిక సంస్థల ప్రతినిధులతో పాటు.. .మేధావులు, విద్యావేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎవరిపై కోపంతో ఏం చేస్తున్నారో అర్దం అవుతుందా..? అని ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత కోపాలతో దేశం పరువును బజారుకీడ్చేలా నిరసనలు తెలపటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఒక్కసారి తల్లితండ్రులు, సమాజం, దేశం గురించి ఆలోచించాలని పిలుపునిస్తున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kerala  lovers  protest  yuva morcha  

Other Articles