Bollywood and tollywood actors taken part in swachh barath pm narendra modi lauds hrithik roshan

Narendra Modi, Hrithik Roshan, Clean India, Swachh Bharat, Prime minister, Akkineni Nagarjuna, Swachh Bharat, Naga Chaitanya, Akhil, Amala,

Bollywood and tollywood actors taken part in swachh barath, PM narendra modi lauds hrithik roshan

స్వచ్ఛభారత్: చీపురుపట్టిన బాలివుడ్, టాలీవుడ్ నటులు

Posted: 10/26/2014 09:51 PM IST
Bollywood and tollywood actors taken part in swachh barath pm narendra modi lauds hrithik roshan

స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకున్న బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఎంతోమందికి స్పూర్తిని కలిగించారని మోడీ తెలిపారు. హృతిక్ నుంచి మీరందరూ స్పూర్తిని పొందుతారనే విశ్వాసాన్ని మోడీ వ్యక్తం చేశారు. పరిశుభ్రతపై మహాత్మా గాంధీ జన్మదినం అక్టోబర్ 2 తేదిన మోడీ ఇచ్చిన పిలుపుకు దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది.
 
ముంబైలోని జుహూలో తన నివాస సమీపంలోని వీధుల్లో క్లీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టాం. స్వచ్ఛ భారత్ లో పాల్గొనడం ద్వారా ఎంతో నేర్చుకున్నాను అని హృతిక్ ట్వీట్ చేశారు. నా దేశాన్ని, నగరాన్ని, విధులను, నివాసంలో పాటించాలని ఓ నిర్ణయం తీసుకున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొనేలా మరికొంతమందిని చైతన్య పరుస్తానని హృతిక్ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.

ఇటు టాలీవుడ్ అగ్రనటుడు హీరో నాగార్జున  'స్వచ్ఛ భారత్' కోసం చీపురు పట్టారు. పరిసరాలను శుభ్రం చేసేందుకు ఆయన నడుం బిగించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆయన 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొన్నారు. అమల, నాగ చైతన్య, అఖిల్, సుశాంత్, నాగసుశీలతో కలిసి అన్నపూర్ణ స్టూడియో సమీపంలో నాగార్జున చెత్తాచెదారాన్ని ఉడ్చారు. చాముండేశ్వరినాథ్ కూడా చీపుపట్టారు.

'స్వచ్ఛ భారత్' లో పాల్గొనాలని రిలయన్స్ గ్రూపు అధినేత అనిల్ అంబానీ.. టెన్నిస్ తార సానియా మిర్జా, తెలుగు సినీహీరో నాగార్జునతోపాటు మొత్తం తొమ్మిది మందిని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే చీపురు పట్టడంలోనే సరిపెట్టకుండా 'స్వచ్ఛ భారత్' లో ప్రజలను చైతన్య పరిచేందుకు, ఎక్కువమందిని ఇందులో భాగస్వాములు చేసేందుకు నాగార్జున వెబ్సైట్ కూడా ప్రారంభించారు. నాగ్ ఫర్ స్వచ్ఛ భారత్ పేరుతో దీన్ని ఆవిష్కరించారు. పరిసరాల శుభ్రతకు నిరంతరం పాటు పడతామని ఈ సందర్భంగా నాగార్జున ప్రతిజ్ఞ చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles