Nara lokesh on his future plans in party

nara lokesh on cm post, nara loeksh comments, nara lokesh latest, nara lokesh interview, telugu desam party, tdp leaders, ap tdp mla list, chandrababu naidu comments, chandrababu family, andhrapradesh latest news, latest telugu news

nara lokesh on his future plans in party : tdp leader and ap cm chandrababu naidu son nara lokesh responds on chief minister post for him, says he don't know for which state he going to elect as cm in andhrapradesh or in telangana

సీఎం పదవిపై లోకేష్ కామెంట్లు

Posted: 10/27/2014 08:09 AM IST
Nara lokesh on his future plans in party

టీడీపీ రాజకీయాల్లో కొద్దికాలంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న నేత, చంద్రబాబు నాయడు తనయుడు నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవిపై తన మనసులోని మాటను బయట పెట్టారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో నారా లోకేష్ భవిష్యత్తుపై తనకున్న అంచనాలను వివరించారు. ఏపీలో మరో పదేళ్ల వరకు టీడీపీనే అధికారంలో ఉంటుందన్నారు. టీడీపీ ఉంటేనే రాష్ర్టం అభివృద్ధి చెందుతుంది అని ప్రజలంతా భావిస్తున్నారని చెప్పారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామిని అమలు చేయటంతో పాటు.., రాష్ర్ట పునర్నిర్మాణం కోసం తమ ప్రభుత్వం కృషి, చేస్తుందన్నారు.

పేరుకు పార్టీ కార్యకర్తల నిధి సంక్షేమ బాధ్యుడుగా ఉన్నప్పటికీ... ప్రస్తుతం పార్టీ వ్యవహారాలు అన్ని లోకేష్ చూసుకుంటున్నారు. ఇలా పార్టీలో కీలకంగా ఉన్న సీఎం తనయుడిని... తానెప్పుడు ముఖ్యమంత్రి అవుతావని ప్రశ్నించగా చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. ప్రస్తుతం మరో పదేళ్ల వరకు టీడీపీ అధికారంలో ఉంటుందని అన్నారు. ఇక తెలంగాణలో అయితే ఇప్పటికే చాలా మంది సీనియర్ నేతలున్నారని కాబట్టి.., తాను సీఎం అవుతానని భావించటం లేదన్నారు. ఒకవేళ సీఎం అయ్యే అవకాశం వస్తే అప్పుడు చూద్దాం అని అన్నారు. పైగా దీనికి కాలమే సమాధానం చెప్తుందన్నారు.

ఇక తాను తెలంగాణ వ్యక్తినా.., ఏపీ వ్యక్తినా అని అడగ్గా, తాను హైదరాబాదీ అని అన్నారు. హైదరాబాద్ లో ఓటు హక్కు ఉన్న వ్యక్తిగా తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసే అధికారం తనకు ఉందన్నారు. అదేవిధంగా పార్టీ నేతగా ఏపీ ప్రజల సమస్యల పరిష్కారం తన బాధ్యత అని చెప్పారు. రెండు రాష్ర్టాల్లో పార్టీ బలోపేతం కోసం తనవంతుగా కృషి చేస్తానని లోకేష్ చెప్తున్నారు. ఉదయమే కార్యాలయంకు వచ్చి నేతలను కలిసి తాజా పరిస్థితులపై చర్చ జరుపుతారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న ఎమ్మెల్మేల్యు, ఎంపీలతో జిల్లాలోపరిస్థితులు, ప్రభుత్వ పనితీరుపై చర్చిస్తారు. ఇదే సమయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులను కలిసి వారితో కాసేపు మాట్లాడుతారు.

ఇలా నిత్యం పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉంటున్న చంద్రబాబు తనయుడు.., రాత్రి ఇంటికి వెళ్ళాక తండ్రితో కలిసి ఆ రోజు జరిగిన విషయాలు, పరిణామాలపై వివరిస్తాడని సన్నిహితులు చెప్తున్నారు. ఈ సందర్బంగా అధినేత ఇచ్చే సూచనల ప్రకారం తర్వాతి రోజు పార్టీ నేతలకు తండ్రి చెప్పిన సమాచారం చేరవేస్తున్నాడు. ప్రస్తుతం పార్టీలో కీ రోల్ ప్లే చేస్తున్న లోకేష్ ముఖ్యమంత్రి పదవి వస్తే చేపట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తాజా ఇంటర్య్వూతో స్పష్టం అవుతోంది. అంటే కాబోయే సీఎం లోకేష్ అన్నమాట. అది ఎప్పుడు అనేది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది. ఇది ఆయన అన్నమాటే.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara lokesh  chandrababu naidu  cm  latest news  

Other Articles