Congress targets rss and bjp to give reply on gopalakrishnan essay in kesari on godsley should have killed nehru instead of gandhi

kesari, Malayalam, magazine, gopalkrishnan, RSS, Manmohan vaidya, ajay maken, PM, narendra modi, digvijay singh, kerala congress, Nehru, mahatma gandhi, congress

congress targets RSS and BJP to give reply on gopalakrishnan essay in kesari on godsley should have killed nehru instead of gandhi

క్రమశిక్షణే దారి తప్పిందా..? అధికారమే రెచ్చగోడుతుందా..?

Posted: 10/26/2014 08:13 PM IST
Congress targets rss and bjp to give reply on gopalakrishnan essay in kesari on godsley should have killed nehru instead of gandhi

ఆర్ఎస్ఎస్ ఎంతో క్రమశిక్షణ గల సంఘం. ఆ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో సభ్యులైన వారెవరూ ఊరికే నోరు జారరు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో మెదులుతారు. అంతటి క్రమశిక్షణా గల ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రికలకు కూడా విలువ ఎక్కువే. దేశభక్తి, భక్తిభావం, పెద్దల పట్ల గౌరవం, తదితరాలను పెంచిపోషించే విధంగా వుంటాయి ఆ పత్రికలోని కథనాలు, వ్యాసాలు. అలాంటిది ఎందుకింత వివాదాస్పదమైన కథనాన్ని ప్రచురించింది అన్నది మాత్రం అర్థం కావడం లేదు. స్వర్గీయులైన స్వాత్రంత్య సమరయోదులు, దేశ తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూనే టార్గెట్ చేస్తూ.. అంతటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. క్రమశిక్షణ దారి తప్పిందని గాక మరేమనాలి..? అంతేకాదు అధికారంలో వున్నది తమ పార్టీయేనన్న అహకారంతో రెచ్చిపోవడమే అని అనాలా..? లేక దారుణమైన వ్యాఖ్యలకు అధికార అహంకారమే కారణమనాలా..? ఆర్ఎస్ఎస్ తేల్చాలి.

జాతిపిత మహాత్మా గాంధీకి బదులుగా భారత విభజనకు కారకుడైన జవహర్ లాల్ నెహ్రూనే అప్పట్లో నాధూరాం గాడ్సే చంపేసి ఉండాల్సిందన్న వ్యాఖ్యలు ఎంత వరకు సమంజసం..? అదీనూ ఆరెస్సెస్ కు చెందిన పత్రిక 'కేసరి' మలయాళ సంచికలో ప్రచురితం కావడం వివాదాస్పదమైంది. ఇప్పుడిదే రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్నే లేపుతోంది. ఈ వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ఆర్ఎస్ఎస్ తప్పించుకోవాలని చూడటం కూడా పెద్ద చర్చనీయాంశంగానే మారింది. ఆర్ఎస్ఎస్ ఈ వ్యాఖ్యాల నుంచి దూరం జరగాలని చూస్తుండడం.. కాంగ్రెస్ వాటిని టార్గెట్ చేయడం కూడా వివాదాస్పదమే అవుతోంది.

కాగా, దేశ విభజనకు అసలు కారకుడు నెహ్రూయేనని ఆరోపిస్తూ గత ఎన్నికల్లో కేరళలోని చలాకుడి లోకసభ నియోజకవర్గం నుండి బీజేపీ తరఫున పోటీ చేసిన బీ గోపాలకృష్ణన్ కేసరీలో  వ్యాసం రాశారు. గాడ్సేకు గాంధీ, ఆయన విధానాల పైన ఎంతో విశ్వాసం ఉందని, దేశ విభజనకు గాంధీయే కారణమని పొరబడ్డారని అందులో పేర్కొన్నారు. దేశ విభజనకు ముందు గాడ్సే వైఖరి ఎలా ఉండేదో చరిత్ర విద్యార్థులు ఎవరైనా నిజాయితీగా అంగీకరిస్తారన్నారు. వారందరు ఆయన తప్పుడు లక్ష్యాన్ని ఎంచుకున్నారని భావిస్తారని, ఆయన గాంధీని చంపి ఉండాల్సింది కాదని, దేశాన్ని విభజించింది నెహ్రూయేనని.. అందుకని గాడ్సే గాంధీకి బదులుగా నెహ్రూను చంపివుంటే బాగుడేందని గోపాలకృష్ణన్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే, తన కథనానికి కట్టుబడి ఉన్నానని వ్యాసకర్త గోపాలకృష్ణన్ ఇప్పటికీ పేర్కొన్నడం కూడా వివాదాస్పదంగా మారింది.

అయితే ఈ వ్యాసాన్ని ఆరెస్సెస్ ఖండించింది. దీనిపై వివరణ ఇచ్చింది. కేసరి మలయాళ సంచికలో ప్రచురించిన వ్యాసంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలు కేవలం ఆ రచయితవి మాత్రమేనని, తమకు ఎలాంటి సంబంధం లేదని ఆరెస్సెస్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆరెస్సెస్ జాతీయ ప్రచార ప్రముఖ్ మన్మోహన్ వైద్య నిన్న ప్రకటన విడుదల చేశారు. ఆరెస్సెస్ ఏ రకమైన హింసను కూడా ప్రోత్సహించదన్నారు. ఇలాంటి పోకడలకు పూర్తి వ్యతిరేకమన్నారు. అయితే ఈ వ్యాసానికి ఆ ప్రతిక సంపాదకునికి, రచయితకు మాత్రమే సంబంధించినదిగా తెలిపింది.

కేరళలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యాసాన్ని కేరళలోని కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది. చరిత్రను వక్రీకరించిన ఈ వ్యాసం ఏమాత్రం సమర్థనీయం కాదని, ఇందుకు మూలకారణం ఆరెస్సెస్, బీజేపీలేనని మండిపడింది. అంతటితో ఆగకుండా దీని పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అభిప్రాయాన్ని చెప్పాలని డిమాండ్ చేసింది. కేసరిలో ప్రచురించిన వ్యాసం అనారికమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ అన్నారు. ఈ వ్యాసం పైన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. భారత చరిత్రను తిరగరాయడం మొదలైందా ఏంట, దీనిపై బీజేపీ, ఆరెస్సెస్, ప్రధాని మోడీ కూడా ప్రకటన చేయాలని ట్వీట్ చేశారు. అయితే, అలాంటిది జరగదని తనకు తెలుసునని ముగింపు ఇచ్చారు.

ఎవరు ఏమన్నా.. ఇంతటి వివాదస్పద రచనలు రచించేప్పుడు ఎవరైనా రాసిన తరువాత సరిచూసుకుంటారు. అయితే బీ గోపాలకృష్ణన్ మాత్రం ఇంకా తాను రాసింది సరైన వ్యాసమే నంటూ బెట్టువీడటం లేదు. అయన సరే, కనీసం ఇలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యాలు రాసేప్పడు సంపాదకులైనా వ్యాసాన్ని చూసుకోవాలి కదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ వ్యవహారం చిలికి చిలికి పెద్ద దుమారంగా మారితే.. ఎవరు బాధ్యులవుతారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. తప్పులు చేయవద్దని పిల్లలకు చెప్పే పెద్దలే.. తప్పలు చేస్తే.. వాటిని ఎలా సమర్థించుకుంటారో..? ఒక్కసారి అలోచించాలి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles