Shiv sena violates election code poll day takes out advertisements on

maharashtra elections, shiv sena, poll day, violates, election code, advertisements

shiv sena violates election code, takes out advertisements on poll day

‘ఎన్నికల’ వేళ ‘కోడ్’ ఉల్లఘించిన శివసేన..

Posted: 10/15/2014 11:35 AM IST
Shiv sena violates election code poll day takes out advertisements on

మహారాష్ట్రలో ఎన్నికల వేళ.. పోలింగ్ జరుగుతుండగా, ఓటరు మహాశయులను ఎలాంటి ప్రభావాలకు గురి చేయకూడదన్న నిబంధనలు తెలిసి కూడా.. శివసేన సాహసానికి ఒడిగట్టంది. ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలకు పూనుకుంది. ఒకవైపు పోలింగ్ జరుగుతుండగా.. శివసేన భారీ పత్రికా ప్రకటనలతో సంచలనం సృష్టిస్తోంది. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ రోజు ఇలా ప్రకటనలు ఇవ్వకూడదు. కానీ, బాల ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రేల ఫొటోలు, బాణం గుర్తుతో భారీ ప్రకటన ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో తామే ప్రధాన పోటీదారులం అన్నట్లుగా ఈ ప్రకటనలు గుప్పించింది.

తమ పార్టీ అధికారిక పత్రికలైన సామ్నా, దోపహర్కా సామ్నా పత్రికల్లో ఇవాళ్టి ఎడిషన్ మొదటిపేజీలో పూర్తి పేజీ ప్రకటనలతో గుప్పించింది. 'ధనుష్య బాణ్ కీ టంకార్ హై, అబ్ అప్నీ సర్కార్ హై' అని ఇందులో నినాదం ఇచ్చింది. ధనస్సు, బాణం శివసేన ఎన్నికల గుర్తు. వాటిని గుర్తు చేసేలా.. ఈసారి అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ ఈ ప్రకటన ఇచ్చింది.

దీంతో పాటు ముంబైలోని ఇతర మీడియా సంస్థలకు మరో రకం పెద్ద ప్రకటన ఇచ్చింది. అందులో అయితే.. ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసుకునేలా ప్రకటనలు వున్నాయి.  ''రావణుడిని.. శ్రీరాముడు హస్తంతో (కాంగ్రెస్ గుర్తు), వాచీతో (ఎన్సీపీ) లేదా పువ్వుతో (బీజేపీ)తో చంపలేదని.. ధనస్సుతో బాణం వేసి చంపారంటూ ఆ ప్రకటనలో ఉంది. అవినీతి, విద్యుత్ కోతలు, విధాన సంక్షోభం, దుష్పరిపాలన.. వీటన్నింటినీ అరికట్టాలంటే ధనస్సు, బాణాలకు ఓటు వేయాలన్నది శివసేన ఓటర్లను కోరింది. శివసేన ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై మహారాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారిందించి. ప్రకటనలు జారీ చేసిన శివసేనతో పాటు.. శివసేన అధికార పత్రిక సామ్నా సహా ప్రకటనలు ఇచ్చిన అన్ని పత్రికలపై చర్యలకు పూనుకుంటోంది. పోలింగ్ కార్యక్రమాలలో ఎలాంటి విఘాతం కలగకూడదని మిన్నకున్న ఎన్నికల సంఘం ఇవాళ సాయంత్రం నాటికి చర్యలను ప్రకటించే అవకాశం వుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maharashtra elections  shiv sena  poll day  violates  election code  advertisements  

Other Articles