Is honourable president brand abbasador of central government

central government, narendra modi, president, pranab mukhurjee, swacch bharath, mahatma gandhi, smart cities, brand abbasador

Is Honourable president brand abbasador of central government.?

ఆ యోధుడిని అబ్బురపర్చిన మోడీ పథకాలు..

Posted: 10/10/2014 11:23 AM IST
Is honourable president brand abbasador of central government

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.. కేంద్ర ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ గా ఎప్పుడు మారారు.. ఎప్పడు బాధ్యతలు చేపట్టారు..? అన్న సందేహాలు కలగక మానవు. హెటెక్స్ లో జరిగిన మెట్రోపొలిస్‌ సదస్సు ముగింపు సమావేశాల్లో ప్రణబ్‌ ప్రసంగం తీరు పరిశీలిస్తే ఇలానే అనిపిస్తుంది. తన నాలుగుపేజీల ప్రసంగంలో అత్యధిక భాగం.. నరేంద్రమోదీ ప్రభుత్వ కార్యక్రమాల గురించే ప్రణబ్‌ ప్రస్తావించారు. రాష్ట్రపతిగా ఎన్నిక కాకముందు ఆయన కాంగ్రెస్ యోధుడు. ఆయననే ప్రధాని నరేంద్రమోడీ పథకాలు అబ్బురపర్చాయంటే పథకాల ప్రభావమే కదా.. ఇక ఎక్కడ ప్రస్తావిస్తే ఏముంది.. పథకాలను వివరించామా..? లేదా అన్నదే ముఖ్యం కానీ...

దీంతో మోదీ సర్కార్‌ ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ అభియాన్‌, అందరికీ ఇళ్లు, స్మార్ట్‌ సిటీలు, హృదయ్‌ కార్యక్రమాల గురించి ప్రణబ్‌ ముఖర్జీ తన ప్రసంగంలో వివరించారు. స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ పేరిట అయిదేళ్ల కోసం కేంద్రం ప్రారంభించిన కార్యక్రమంలో అందరికీ మరుగుదొడ్డి సౌకర్యాలు కల్పించాలని, 4041 పట్టణాలను పరిశుభ్రంగా మార్చాలని కంకణం కట్టుకున్నారని ప్రణబ్‌ చెప్పారు. మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి ఈ లక్ష్యాన్ని నెరవేర్చడమే కేంద్ర సర్కార్‌ ఉద్దేశంగా ఆయన వివరించారు. మోదీ సర్కార్‌ చేపట్టిన అందరికీ ఇళ్లు కార్యక్రమం కూడా అత్యంత కీలకమైనదని, కొత్త మురికివాడలు ఏర్పడకుండా గృహనిర్మాణ విధానాలను ఏర్పర్చాల్సిన అవసరం ఉన్నదని ప్రణబ్‌ వివరించారు. పట్టణీకరణ వేగవంతంగా జరుగుతున్న రీత్యా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకారాలు అందించేందుకు మోదీ సర్కార్‌ వినూత్న పట్టణాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కూడా రాష్ట్రపతి ప్రకటించారు.

దేశంలోని 500 నగరాల్లో ఒక ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. దేశంలో వంద స్మార్ట్‌ సిటీలను అభివృద్ది చేయడంతో పట్టణ ప్రణాళిక, సుపరిపాలన, పర్యావరణం, మౌలిక సదుపాయాలు, ఐటి రంగాలపై దృష్టి కేంద్రీకరించారని, ప్రతి ఒక్కరికీ ఐటీ ప్రయోజనాలు లభించేలా చూడడం, ప్రజల జీవన నాణ్యతను పెంచడం కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఇలా మోదీ సర్కార్‌ చారిత్రక నగరాల అభివృద్ధి పథకం(హృదయ్‌) ల గురించి కూడా వివరించారు.

మరోవైపు తెలంగాణ, కేసీఆర్‌ల గురించి కూడా రాష్ట్రపతి ప్రణబ్ ప్రస్తావించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత గల తొలి అంతర్జాతీయ సమావేశానికి తనను ఆహ్వానించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రణబ్‌... ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు. అయితే ప్రసంగం మధ్యలో ఆయన హైదరాబాద్‌ మెట్రో ప్రస్తావన కూడా తెచ్చారు. భారతదేశంలోని ప్రజారవాణా వ్యవస్థల్లో హైదరాబాద్‌ మెట్రోది ఉత్తమ నమూనాగా ఆయన అభివర్ణించారు. ప్రపంచంలో ఇలాంటి ప్రయత్నాలకు అది ఆదర్శంగా నిలుస్తుందని ప్రణబ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదంతా చదివిన తరువాత రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారని మీకూ అనిపించిందా..? నిజమే రాష్ట్రపతి అనగానే కేంద్రంలో అధికారంలో వున్న ప్రభుత్వ పథకాలను, చేపడుతున్న పనులను వల్లెవేయాలంటారా..? అలా అనేవాళ్లు కూడా వున్నప్పడు.. మన దేశంలో జరుగుతున్న ప్రప్రంచ సదస్సులో మన కేంద్ర ప్రభుత్వం చేపడతున్న పథాకాలను రాష్ట్రపతి వల్లెవేయడంలో తప్పులేదని అనేవాళ్లు వున్నారు. దేశవిదేశాల నుంచి వచ్చిన ప్రతినిధుల ఎదుట మన దేశం ఐక్యతను చాటాలసిన బాధ్యత కూడా మనపైనే వుందంటున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles