Krishna yadav replaces talasani in hyderabad

lKrishna yadav, Fake stamp scam, talasani srinivas yadav, tdp, trs

krishna yadav replaces talasani srinivas yadav in hyderabad

రారా కృష్ణయ్య..! రారా కృష్ణయ్య..!

Posted: 10/10/2014 12:06 PM IST
Krishna yadav replaces talasani in hyderabad

పార్టీతో పాటు క్యాడర్ లోనూ మంచి పట్టున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కారులో షికారుకు బయలుదేరుతుండటంతో దిక్కులు చూస్తున్న గ్రేటర్ టీడీపీ.. రారా కృష్ణయ్య..! అంటూ పాట పాడుతోంది. ఎవరి కోసమో కాదండి.. మాజీ మంత్రి, హిమాయత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కృష్ణా యాదవ్ గురించి. తలసాని సామాజిక వర్గానికి చెందిన కృష్ణా యాదవ్ ను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి తీసుకురావాలని పాట ఆలపిస్తోంది. ఇన్నాళ్లు అసలు పట్టించుకోని టీడీపీ.. తలసాని వెళ్లడం ఖాయంగా తేలిపోవడంతో కృష్ణాయాదవ్ కు ఏకంగా గ్రేటర్ టీడీపీ అధ్యక్ష పగ్గాలను కట్టబెట్టారు. తలసానికి గట్టిగా ఎదుర్కొనేందుకే కృష్ణయాదవ్కు అధ్యక్ష పదవి కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

పాతబస్తీకి చెందిన కృష్ణయాదవ్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు. తెలుగు విద్యార్థి నాయకుని నుంచి అంచెలంచెలుగా ఎదిగారు.  1994లో హిమాయత్ నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విప్గా పనిచేశారు. చంద్రబాబు హయాంలో కార్మిక శాఖ, పశు సంవర్థక శాఖ మంత్రిగా పని చేశారు. అయితే నకిలీ స్టాంపుల కుంభకోణంలో 2003లో టిడిపి ప్రభుత్వ హయాంలో మంత్రిగా వున్న సమయంలోనే కృష్ణయాదవ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు.  జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత టిడిపిలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఎట్టకేలకు అధ్యక్షుడి అనుమతితో ఏడాదిన్నర క్రితం ఆయన  టీడీపీలో చేరారు.

ఇక కృష్ణాయాదవ్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరూ ఒకే సారి శాసనసభలో కలిసి అడుగుపెట్టారు.  టీడీపీలో నగరం నుంచి బలమైన నాయకులుగా ముద్రపడ్డారు. అర్ధబలం, అంగబలంలోనూ వారిద్దరు సమఉజ్జీలే. అయితే ఆ తర్వాత ఆ ఇద్దరి మధ్య రాజకీయ వైరం నెలకొంది. ఎంతలా అంటే ఒకరి నీడను మరొకరు సహించలేనంతగా. ఆ తర్వాత నకిలీ స్టాంపుల కుంభకోణంలో ఇరుక్కుని కృష్ణాయాదవ్‌ పార్టీ నుంచి బహిష్కృతుడు కావడంతో తలసానికి పార్టీలో మరింత ప్రాధాన్యత పెరిగింది. ఓ దశలో తలసాని...  పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారారు కూడా. అనుకున్నది సాధించుకునేందుకు తలసాని పార్టీ మారే అస్త్రాన్ని కూడా పలుమార్లు ఉపయోగించుకున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishna yadav  Fake stamp scam  talasani srinivas yadav  tdp  trs  

Other Articles