Lady techie goes missing in hyderabad

lady techie missing, software engineer, kukatpally

Several doubts surround lady techie goes missing in hyderabad

భవ్యశ్రీ ఎక్కడకెళ్లింది..? అదృశ్యంపై అనుమానాలు..?

Posted: 10/10/2014 10:57 AM IST
Lady techie goes missing in hyderabad

కూకట్పల్లి ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భవ్యశ్రీ అదృశ్యం అయ్యారు. తాను ఆఫీస్ కు వెళ్తున్నట్ల భర్తకు మేసేజ్ పెట్టన భవ్యశ్రీ ఎక్కడకు వెళ్లింది. ఏమైంది..? ఎవరైనా కిడ్నాస్ చేశారా..? లేక వివాహిత ను ట్రాప్ చేశారా..? లేక ఈ అదృశ్యం వెనుక భర్త హస్తం వుందా..? అన్న సందేహాలు కలుగుతున్నాయి. విజయవాడకు చెందిన భవ్యశ్రీ రెండేళ్ల క్రితం కార్తీక్ చైతన్యను ప్రేమ పెళ్లి చేసుకుంది. అన్ని సవ్యంగానే వున్నా భవ్యశ్రీ అదృశ్యం కావడంపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి.

గురువారం ఉదయం క్యాబ్లో డ్యూటీకి బయల్దేరింది భవ్యశ్రీ. క్యాబ్లో వెళ్తున్నట్లుగా భర్తకు సెల్ఫోన్లో మెసేజ్ కూడా పంపింది. సాయంత్రమైనా ఇంటికి తిరిగిరాకపోవడంతో అమె భార్య కార్తీక్ చైతన్య తన భార్య కనిపించడంలేదంటూ కూకట్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అమె ఆపీసుకు వెళ్లిన ఓ గంట తరువాత కార్తీక్ ఫోన్ చేశాడు. భవ్యశ్రీ లిఫ్ట్ చేయలేదు. బిజీగా వుందని ఊరుకున్నాడు. మళ్లీ మధ్యాహ్నం, సాయంత్రం ట్రై చేసినా ఫలితం లేదు. దాంతో ఆఫీసుకు వెళ్లి అడిగితే.. అక్కడివాళ్లు ఆమె రాలేదని చెప్పారు. మరి పోలీసుల దర్యాప్తులో మాత్రం భవ్యశ్రీ గత కొన్ని రోజులుగా విధులకు హాజరు కావడం లేదని యాజమాన్య వర్గాలు తెలిపాయి. భవ్యశ్రీ, కార్తీక్ చైతన్యలిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారని, ఎలాంటి గొడవలు లేవని స్థానికులు పోలీసులకు చెప్పారు.
.
ఆఫీసు వెళ్లని భవ్వశ్రీ.. భర్తతో ఆఫీసుకు వెళ్తున్నానని అబద్దం ఎందుకు చెప్పింది..? ఇంటి వద్దకు అఫిస్ క్యాబ్ వచ్చిందని.. అందులోనే వెళ్తున్నానని చెప్పి ఎక్కడకు వెళ్లింది.? ముందు వేసుకున్న ప్రణాళిక ప్రకారమే భర్తకు అబద్దం చెప్పిందా..? ఎవరి ట్రాప్ లోనైనా చిక్కకుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వీటితో పాటు తన భార్యపై అనుమానం వచ్చిన కార్తీక్ భవ్యను ఏమైనా చేశాడా..? అమె ఆఫీసుకు వెళ్లడం లేదని ముందే తెలుసుకున్న కార్తీక్ ప్రణాళికా బద్దంగా భవ్యశ్రీపై ప్రతికారం తీర్చుకున్నాడా అన్న అనుమానాలూ రేకెత్తుతున్నాయి. పోలీసులు దర్యాప్తులోనే నిజానిజాలు వెల్లడి కావాల్సి వుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lady techie missing  software engineer  kukatpally  

Other Articles