Boy died in devaragattu panic incident

devaragattu, devaragattu bunny, devaragattu banny, devaragattu latest, devaragattu incident, devaragattu updates, devaragattu history, devaragattu incident, devaragattu dasara celebrations, dasara celebrations, kurnool district, latest news

in kurnool distirict devaragattu bunny culture a boy dead during the programme : a boy dead and sixty people injured in devaragattu bunny incident

భక్తి అంటూ బాలుడిని బలితీసుకున్నారు

Posted: 10/04/2014 11:13 AM IST
Boy died in devaragattu panic incident

కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం మరోసారి రక్తసిక్తమైంది. పోలిసుుల ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.., ఈ సారీ నెత్తుటిక్రీడ ఆగలేదు. ఏటా దసరా రోజు సాయంత్రం దేవరగట్టు కొండల్లో ఉన్న మాలమల్లేశ్వరస్వామి వేడుకలు బన్నీ ఉత్సవాల పేరుతో జరుగుతాయి. ఉత్సవం ముగిసిన తర్వాత విగ్రహాన్ని సొంతం చేసుకునేందుకు పది గ్రామాల ప్రజలు పోటిపడతారు. కర్రలు చేతపట్టి కొట్టుకుంటూమరి విగ్రహాన్ని స్వాధీనం చేసుకునేందుకు పోటి పడతారు.

మాలమల్లేశ్వరస్వామి విగ్రహం ఎవరి ఊరిలో ఉంటే వారి ఊరిలో పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయని నమ్మకం. అందుకే ఇంతలా కొట్టుకుంటారు. ఆచారం, సాంప్రదాయం పేరుతో జరుగుతున్న ఈ హింసను అడ్డుకునేందుకు పోలిసులు కొద్దికాలంగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కర్రల యుద్ధంలో ఇనుపచువ్వలు,  ఇతర ఆయుధాలు వాడకుండా ఆంక్షలు పెట్టారు. అదేవిధంగా కర్రలతో ఎవరు దాడులు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కానీ దసరా రోజు సాయంత్రం అయ్యే సరికి అందరి చేతులకు కర్రలు వస్తాయి. అంతా పూనకంతో ఊగిపోతూ విగ్రహం కోసం కర్రలతో కొట్టుకుంటూ పోటిపడతారు.

ఈ సారి కూడా శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ పోటిలో ఓ పదేళ్ళ బాలుడు మృతి చెందాడు. అటు మరో 60మందికి గాయాలు అయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రులకు తరలించారు. బాలుడి మృతిపై పోలిసులు స్పందించారు. మృతుడి కుటుంబం ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. ఏటా పదుల సంఖ్యలో ప్రజలు నెత్తురు చిందిస్తున్నా ఈ ఆచారం ఆపేందుకు మాత్రం దేవరగట్టు ప్రజలు నిరాకరిస్తున్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles