Karnataka to send jayalalitha to tamilnadu

jayalalitha, jayalalitha arrest, jayalalitha latest, jayalalitha cases, jayalalitha jailed, jayalalitha imprisonment, jayalalitha case, jayalalitha future, jayalalitha latest updates, crime, da cases, karnataka, tamilnadu, latest news

karnataka government wants to send jayalalitha to tamilnadu because government dont want to maintan risk of jayalalitha : karnataka government feels risk with jayalalitha maintanance and security at jail premises so it decided to ask tamilnadu government to take jaya to own state

జయను ఇబ్బందిగా ఫీలవుతున్న కర్ణాటక

Posted: 10/04/2014 01:12 PM IST
Karnataka to send jayalalitha to tamilnadu

తమిళనాడు మాజి ముఖ్యమంత్రి జయలలితను కర్ణాటక ప్రభుత్వం బరువుగా భావిస్తోంది. మామూలు బరువు కాదు అవసరం లేని అదనపు బరువుగా భావిస్తోంది. అందుకే తమిళనాడుకు తరలించాలని కేంద్రాన్ని కోరనుంది. జైలులో జయ సాధారణ జీవితమే గడుపుతుండగా ఆమెను బరువుగా భావించటం ఏమిటి అనే కదా  మీ సందేహమంతా. అమ్మ సాదాసీదాగానే ఉంది అభిమానులే హంగామా చేసి ఇబ్బంది పెడుతున్నారు. రోజు అమ్మకోసం జైలు దగ్గరకు వస్తున్న అభిమానులు, మంత్రులు,  ఇతర నేతలతో బందోబస్తు కల్పించటం కర్ణాటక పోలిసులకు ఇబ్బందిగా మారుతోంది. దీంతో ఎందుకు వచ్చిన తలనొప్పి మాకు అనుకుంటున్నారు కర్ణాటక ప్రభుత్వ పెద్దలు.

అమ్మకు కర్ణాటకతో సంబంధమే లేదు

తమిళనాడు మాజి ముఖ్యమంత్రికి కర్ణాటకలోని కోర్టుకు సంబంధం ఏమిటి అంటే ఏమి లేదు. కేవలం విచారణ సాయం మాత్రమే. అంటే కరుణానిధి  జయలలితపై దాఖలు చేసిన పిటిషన్  విచారణ సందర్బంగా ఇద్దరు ప్రముఖులు కావటంతో కేసును ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువని అనుమానాలు వచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసు విచారణ తమిళనాడుకు బదులు బెంగళూరు సమీపంలోని కోర్టు వాదిస్తుంది అని  చెప్పి అక్కడకు బదిలీ చేసింది. సుప్రీం చెప్పింది కదా అని విచారణ సాయం కర్ణాటక కోర్టు.., శిక్షను కూడా విధించి అమ్మను జైలుకు పంపింది. ఈ సందర్బంగా బెంగళూరులో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. అన్నాడీఎంకే కార్యకర్తలు, అమ్మ అభిమానులు నానా రచ్చ చేశారు. వీరిని అదుపుచేసేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దింపినా ఉద్రిక్తతలు మాత్రం ఆగలేుదు. బస్సులు ద్వంసం అయ్యాయి. లాఠీచార్జ్ లు జరిగాయి.

ఇక ఆ తర్వాత జయను తరలించిన జైలు దగ్గర ఆమెకోసం అదనంగా భద్రతను పెంచారు. నిత్యం జయను కలిసేందుకు, చూసేందుకు చాలామంది తమిళనాడు ప్రముఖులు, సాధారణ ప్రజలు జైలు దగ్గరకు వచ్చి హంగామా చేస్తున్నారు. అయితే  ఎవరిని కలవాలని కోరుకోవటం లేదని జయ చెప్పటంతో జైలు అధికారులు కూడా  ఏమి చేయలేకపోతున్నారు. అటు తమిళుల హడావుడిపై కర్ణాటక పోలిసులకు చిర్రెత్తుకొస్తుంది. తమకేమి సంబంధం లేని కేసుపై ఎందుకింత కష్టపడాలి అని ప్రభుత్వం వద్ద వాపోతున్నారు.

దీనికి తోడు రెండ్రోజుల క్రితం జయకు అనారోగ్యం కలిగింది. ఖైదీలకు అనారోగ్యం కలిగితే ఇంటినుంచి ఆహారం తీసుకువచ్చేందుకు అనుమతి ఉంటుంది. అయితే పరప్పణ అగ్రహార జైలులో ఈ అనుమతి లేదు. దీనికి తోడు ఇంటి భోజనం అంటే కర్ణాటకలో జయకు ఇళ్లులేదు. అటు తమిళనాడు నుంచి తేవాలి అంటే సమయాభావం ఎక్కువ అవుతుంది.  దీనికి తోడు ఇంటినుంచి అంటే కుటుంబ సభ్యులు ఎవరు తీసుకువస్తారు? ఇదే సమయంలో జయకు ఏమైనా జరిగితే కర్ణాటకమీద నిందలు పడటంతో పాటు రాష్ర్టం తమిళుల ఆగ్రహానికి నష్టపోతుంది అని బెంగళూరు భయపడుతోంది. ఈ విషయాన్ని సీనియర్ మంత్రులు సైతం అంగీకరిస్తున్నారు.

దీంతో జయను వీలైనంత త్వరగా సొంత రాష్ట్రానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కర్ణాటక కోరనుంది. జయ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ వచ్చేవారం విచారణకు రానుంది. ఒకవేళ బెయిల్ వచ్చిందా సంతోషం పని తక్కువ అయి ఆమెనే స్వయంగా వెళ్లిపోతుంది. లేకపోతే తామే కేంద్రాన్నికోరి బరువును దించుకోవాలని కన్నడ నేతలు భావిస్తున్నారు. పాపం అమ్మ బయట ఉన్నన్నాళ్లు వివాదాలు చుట్టుముట్టగా.., లోపల ఉన్న సమయంలో ప్రభుత్వంకు విసుగువస్తుంది. చూడాలి మరి అమ్మ పయనం ఎటు వెళ్తుందో...!
 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha  karnataka  tamilnadu  latest news  

Other Articles