Vishakapatnam will become it hub

vishakapatnam, vishakapatnam city, vishakapatnam latest, vishakapatnam town, vishakapatnam locations, vishakapatnam beauties, vishakapatnam girls, vishakapatnam beach, vishakapatnam tourist places, latest news, it, vishakapatnam it companies, it companies, it jobs, chandrababu naidu, andhrapradesh, andhrapradesh government, andhrapradesh map, hyderabad, telangana, it companies in hyderabad

vishakapatnam will become it hub for andhrapradesh with latest agreements : andhraprdesh government made agreements with major it companies for it development in the state by maintaining vishakapatnam as hub for it

ఇక ఐటి హబ్ గా విశాఖ.. సీఈవోల సదస్సులో ఒప్పందాలు

Posted: 09/29/2014 04:22 PM IST
Vishakapatnam will become it hub

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం సమీప భవిష్యత్తులో ఐటి హబ్ గా మారనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్ తో చేపట్టిన కార్యక్రమాల వల్ల ఏపీకి వచ్చేందుకు కంపనీలు ఆసక్తి చూపుతున్నాయి. విశాఖపట్నంలో జరిగిన ఐటీ కంపనీల సీఈవోల సదస్సకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు ఎంపీలు, స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు గోపాలకృష్ణన్ ఈ సదస్సకు హాజరయ్యారు. దాదాపు 400 కంపనీలు ఈ సదసస్సులో పాల్గొన్నాయి. పలు ప్రముఖ ఐటీ కంపనీలు..., ఏపీతో పలు ఒప్పందాలు చేసుకున్నాయి. తాజా ఒప్పందాలతో ఏపీలో ఐటీ విస్తరించనుంది. ఇప్పటికే విశాఖపట్నంలో పలు ఐటి కంపనీలు ప్రారంభం కాగా., త్వరలో వీటి సంఖ్య మరింత పెరగనుంది.

ఐటీ హబ్ గా విశాఖ

అందాల విశాఖ నగరం త్వరలోనే ఐటీ హబ్ గా మారనుంది. తాజాగా జరిగిన సదస్సలో విశాఖలో కంపనీల, ఫ్రాంచైజీలు, బ్రాంచీలు నెలకొల్పేందుకు పలు కంపనీలు సుముఖత వ్యక్తం చేశాయి. ముఖ్యంగా విప్రో, టెక్ మహింద్రా, సమీర్ సహా ఇతర ప్రముఖ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అంతేకాకుండా మధురవాడ ఐటి ఇంక్యుబేషన్ సెంటర్ అభివృద్ధికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. చిన్న వ్యాపారులు, మహిళలు ఇంటర్నెట్ సౌకర్యం ద్వారా లాభం పొందేందుకు గూగుల్ ఇండియాతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటితో పాటు ఇతర కీలక కంపనీలతో రాష్ర్టంలో ఐటి పరిశ్రమ అభివృద్ధి జరిగేలా ఒప్పందాలు జరిగాయి.

ఉమ్మడి రాష్ర్టంలో హైదరాబాద్ కు ఐటీ కంపనీలు తీసుకువచ్చి.., భాగ్యనగరాన్ని విశ్వవ్యాపితం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా విశాఖను ప్రపంచ పటంలో నిలిపేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగానే ఇక్కడ కంపనీలను నెలకొల్పేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. కంపనీలకు రాయితీలు కల్పిచటంతో పాటు.., ఇతర సౌకర్యాలు త్వరగా అనుమతి లభించేలా చర్యలు చేపడుతామన్నారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను పలువురు ఐటి కంపనీ ప్రతినిధులు ప్రశంసించారు. క్లిష్ట పరిస్థితుల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకునే సత్తా బాబుకు ఉందన్నారు. అటు మేడ్ ఇన్ ఇండియా,మేడ్ ఇన్ ఏపీలో విశాఖ ఐకాన్ గా నిలుస్తుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. విభజనతో ఒంటరిగి నిలబడిన ఏపీని విజన్ తో చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారు అని విశ్లేషకులు అంటున్నారు.

గూగుల్ లాగే ఏపీ అభివృద్ది

ఇక  ఈ సదస్సులో ప్రసంగించిన చంద్రబాబు.. ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. గూగుల్ తరహాలో వేగంగా వృద్ధి సాధిస్తామన్నారు. తూర్పు కోస్తాలో విశాఖ ఉత్తమ నగరంగా ప్రశంసించారు. ఏపీకి చెందిన నిపుణులు ఏడు ఖండాల్లో, ప్రతి విభాగాల్లో ఉన్నారని చెప్పారు. విశాఖను సిలికాన్ కారిడార్ గా మారుస్తామన్నారు. హైదరాబాద్ నుంచి రూ. 65వేల కోట్ల ఐటి ఎగుమతులు జరుగుతున్నాయంటే మనకు ఉన్న ప్రాధాన్యం ఏమిటో అర్ధం చేసుకోవాలన్నారు. హైదరాబాద్ లో ఐటీ నిర్మాణంకు 9ఏళ్లు పట్టగా ఏపీలో మాత్రం కేవలం 4సంవత్సరాల్లో ఈ వృద్ధి సాధిస్తామన్నారు. హైదరాబాద్ ఐటికి హైటెక్ సిటి గుర్తుగా ఉంటే.. ఏపికి విశాఖలోని మధురవాడ సింబల్ గా ఉంటుందని అన్నారు. బాబు కలలు త్వరలోనే నిజం అయి ఏపీ అభివృద్ధి చెందాలని.., అక్కడ ప్రజల జీవితాలు మెరుగుపడాలని తెలుగు విశేష్ కోరుకుంటోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vishakapatnam  it companies  latest news  chandrababu naidu  

Other Articles