Trs mp kadiyam srihari fires on errabelli dayakar

errabelli dayakar rao, errabelli dayakar rao joins trs, errabelli dayakar rao comments on kcr, errabelli dayakar rao on revanth reddy, errabelli dayakar rao wiki, errabelli dayakar rao latest, kadiyam srihari, kadiyam srihari wiki, kadiyam srihari mp, kadiyam srihari latest, kadiyam srihari profile, errabelli meets kcr, trs leaders on errabelli dayakar rao, telangana, latest news, politics

trs mp kadiyam srihari fires on errabelli dayakar rao and says that tdp leader that he called him to join in trs : errabelli dayakar rao and kadiyam srihari quarells in warangal zilla parishath meeting

టీఆర్ఎస్ లోకి వస్తానని ఫోన్ చేయలేదా ఎర్రబెల్లీ..?

Posted: 09/29/2014 03:40 PM IST
Trs mp kadiyam srihari fires on errabelli dayakar

తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుకు టీఆర్ఎస్ నేత, ఎంపీ కడియం శ్రీహరి చుక్కలు చూపించారు. వరంగల్ జెడ్పి సమావేశంలో ఇద్దరు నేతలు ఢీ: అంటే ఢీ: అనేలా మాటలు అనుకున్నారు. మొదట్లో కడియంను ఇరుకున పెట్టేందుకు ఎర్రబెల్లి అదరగొట్టినట్లు మాట్లాడారు. కాని చివర్లో ఎంపి అన్న మాటకు నోరు కదపలేకపోయారు. ఇక్కడ రాజకీయాలు వద్దు అని తప్పించుకునే ప్రయత్నం చేశారు తప్ప ఆరోపణను తోసిపుచ్చే ధైర్యం చేయలేకపోయారు. ఈ కామెంట్ పై ప్రస్తుతం తెలంగాణలోని రాజకీయ నేతల మద్య తీవ్ర చర్చ జరుగుతోంది.

ఫోన్ చేయలేదా.. చెప్పు..?

సోమవారం జరిగిన వరంగల్ జెడ్పీ సమావేశం రసాబాసగా మారింది. ఎరువులు అక్రమంగా బయట విక్రయిస్తున్నారని టీడీపీ ఈ అంశాన్ని లేవనెత్తింది. అదేవిధంగా రైతుల ఇబ్బందులు, ఎరువులు లేక పంటలు నష్టపోతున్న అంశాలపై టీడీపీ నేతలు విమర్శలు చేశారు. దీనికి ఎంపి కడియం శ్రీహరి సమాధానం ఇస్తుండగా., ఎంపీ ఏమి చెప్పనవసరం లేదు అంటూ ఎర్రబెల్లి మాట్లాడారు. దీంతో కడియంకు కోపం వచ్చింది. మీరేంటి నాకు చెప్పేది. ఎవరేమిటో అందరికి తెలుసు.., ‘టీఆర్ఎస్ లో చేరుతాను’ అని నాకు ఫోన్ చేయలేదా చెప్పు అని దయాకర్ రావును కడియం ప్రశ్నించారు.

ఈ మాటలతో ఎర్రబెల్లి ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అయితే వెంటనే తేరుకుని ఇది రాజకీయాలకు వేదిక కాదు. ప్రజా సమస్యలకు పరిష్కారం కావాలి అని అన్నారు. అయితే గులాబిదళంలో చేరికపై కడియం శ్రీహరి చేసిన ఆరోపణను మాత్రం ఎర్రబెల్లి తోసిపుచ్చలేదు. దీంతో తాను టీఆర్ఎస్ లో చేరటం లేదని.. కేసీఆర్ ను కలిసింది అవాస్తవం అని గతంలో ఆయన చెప్పిన మాటలు అవాస్తవం అని స్పష్టం అవుతోంది. కేసీఆర్ ను కలవటం మాట అటుంచితే.., గులాబి దళంలో చేరేందుకు మాత్రం దయాకర్ రావు తీవ్రంగ ప్రయత్నించినట్లు స్పష్టం అవుతోంది. మరి దీనిపై పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారో చూడాలి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kadiyam srihari  errabelli dayakar rao  trs  tdp  

Other Articles