Priyanka gandhi serves legal notice to some media outlets

Priyanka Gandhi, legal notice, some media outlets, Rehan

priyanka-gandhi-serves-legal-notice-on-some-media-outlets

ఆ 12 మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు..

Posted: 09/25/2014 04:24 PM IST
Priyanka gandhi serves legal notice to some media outlets

తన కుమారుణ్ని రాహుల్‌ గాంధీకి దత్తత ఇస్తున్నానన్న వార్తలపై ప్రియాంక వాధ్రా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అర్థంపర్థం లేని ఇలాంటి అసత్యపూరిత కథనాలు తన కుటుంబ ప్రతిష్టను దెబ్బ తీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రియాంక... ఆ వార్తా కథనాలను ప్రచురించిన వార్తాపత్రికలకు లీగల్‌ నోటీసులు జారీ చేశారు. ఇటీవల ఓ వారపత్రిక, మరికొన్ని వార్తాపత్రికలలో... ప్రియాంక తన 13 ఏళ్ల కుమారుడు రైహాన్‌ను రాహుల్‌ గాంధీకి దత్తత ఇస్తోందన్న వార్తలు ప్రచురించడంపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న కాంక్ష నేపథ్యంలో గాంధీ అన్న ఇంటి పేరును నిలబెట్టుకునేందుకు ప్రియాంకవాద్రా.. రాహుల్ గాంధీకి తన కుమారుడు రైహాన్ ను దత్తత ఇస్తుందని ఆ వార్తా పత్రికలు ప్రచురించాయి.  దీంతోపాటూ... రైహాన్‌ పాఠశాల రికార్డుల్లో గార్డియన్‌గా రాహుల్‌ పేరే ఉందని ఆ కథనాల్లో పేర్కొన్నారు. ఈ కథనాలపై మండిపడ్డ ప్రియాంక పాఠశాల రికార్డులను మీరు పరిశీలించారా..? లేక దత్తత ఇస్తున్నట్లు మా కుటుంబ సభ్యులు ఎవరైనా చెప్పారా.? అంటూ మీడియాను ప్రశ్నించారు. తమ పేపర్ల ప్రచారం కోసం తమ కుటుంబ పరువు ప్రతిష్టలను బజారున పెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఎలాంటి ఆధారాలు లేని ఇలాంటి వార్తలను ఎలా ప్రచురిస్తారంటూ మండిపడ్డారు.

రాజకీయ కారణాల కోసం తన కుమారుణ్ని దత్తత ఇవ్వడమనే ఆలోచనే తనకు వెగటు కలిగిస్తోందని ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ అభూతకల్పనలంటూ ఆమె ఖండించారు. తన కుటుంబానికి అప్రతిష్ట తెచ్చిన ఆ వార్తాపత్రికలపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలు తీసుకుంటానని ప్రియాంక నోటీసులు జారీ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Gandhi  legal notice  some media outlets  Rehan  

Other Articles