Indian muslims will live and die for india

Narendra Modi, BJP, Indian Muslims, Al Qaeda, cnn interview

Indian Muslims will live and die for India: PM Narendra Modi

భారతీయ ముస్లింలు దేశం కోసం ప్రాణాలిస్తారు

Posted: 09/19/2014 04:40 PM IST
Indian muslims will live and die for india

భారతీయ ముస్లింలలో దేశ భక్తి ఎక్కువని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. వారు దేశంకోసం బతుకుతారని, అవసరమైతే దేశంకోసమే ప్రాణాలర్పిస్తారని ఆయన స్పష్టంచేశారు. ప్రధాన మంత్రి హోదాలో తొలిసారిగా ఆయన అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ భారత్‌లో విఫలమవుతుందని, ఎంత ప్రయత్నించినా భారతీయ ముస్లింలు ఉగ్రవాద సంస్థలో సభ్యులుగా చేర్చుకోలేదని ప్రధాని  అన్నారు. దేశానికి చెడుచేయాలని భారతీయ ముస్లింలు ఎప్పుడూ కోరుకోరన్నారు.

భారతీయ ముస్లింలు వారు చెప్పినట్లు వింటారని ఎవరైనా భావిస్తున్నట్లయితే అది వారి భ్రమే అవుంతుందని మోడీ తేల్చిచెప్పారు. అల్ ఖైదా చీఫ్ అయ్యమాన్ అల్ జవహారీ ఇటీవల దక్షిణ అసియాలో ఇండియాను తమ ఉగ్రవాద సంస్థకు కేంద్రంగా చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. కాశ్మీర్, గుజరాత్ లలో భారతీయ ముస్లింలకు అనుభవించిన ఆకృత్యాల నుంచి స్వేచ్ఛను కల్పిస్తమాని చెప్పారు. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. మోడీ బదులిచ్చారు. ఉగ్రవాద సంస్థలు భావిస్తున్నట్లు భారతీయ ముస్లింలు.. తమ పాటలకు అనుగూణంగా నృత్యం చేస్తారనుకుంటే అది భ్రమేనన్నారు.

17 కోట్ల మంది భారతీయ ముస్లింలు అల్ ఖైదా పట్ల ఎందుకు ఆకర్షితులౌవ్వడం లేదన్న ప్రశ్నకు కూడా మోడీ సావధానంగా బదులిచ్చారు. ముందుగా తాను ఈ తరహా ఊహాజనిత, మతపర అంశాలపై విశ్లేషణ చేయడం లేదన్నారు. అయితే మతాల కన్నా మానవత్వం ముఖ్యమని చెప్పారు. మానవత్వంతో వ్యవహరించాలా..? లేదా అన్న ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ఉత్పన్నమవుతుందని ఈ ఆదివారం ప్రసారం కానున్న పూర్తి ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలను సీఎన్ఎన్ శుక్రవారం ప్రసారం చేసింది.


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  BJP  Indian Muslims  Al Qaeda  cnn interview  

Other Articles