Shiv sena bjp to part ways

Shiv Sena, BJP, Maharashtra, Sena-BJP alliance, Uddhav Thackeray, Sanjay Raut, Amit Shah

Shiv Sena, BJP to contest Maharashtra assembly polls separately?

‘మహా’ బరిలో ఒంటరిపోరుకే మిత్రుల మొగ్గు

Posted: 09/19/2014 05:31 PM IST
Shiv sena bjp to part ways

మహారాష్ట్ర అసెంబ్లీ త్వరలో జరగనున్న ఎన్నికలలో బీజేపి, శివసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇప్పుడప్పుడే కొలిక్కి వచ్చేట్టు కనిపించడం లేదు. గత రెండున్నర దశాబ్ధాలుగా ఈ రెండు పార్టీల మధ్య వున్న మైత్రికి ఇప్పడు బ్రేకులు పడేట్టు వుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో సగం స్థానాలను ఇవ్వాలని బీజేపి బెట్టు చేస్తుండడంతో.. సీట్ల సర్దుబాటు వ్యవహారం తేలడం లేదు. రానున్న ఎన్నికలలో తమ సత్తాను ఒంటరిగానే చాటుతామని ఇరు పార్టీలు తెగేసి చెబుతున్నాయి. సీట్ల సర్థుబాటు వ్యవహారంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి సీట్ల సర్థుబాటు విషయాన్ని ప్రకటించాలని భావిస్తున్నాయి. మహారాష్ట్రలో సగం స్థానాలలో తమ అభ్యర్థులు పోటీ చేస్తారన్న అంశంలో బీజేపి బెట్టు వీడటం లేదని సమాచారం.

గత ఎన్నికలలో బీజేపికి కేటాయించిన సీట్ల కన్నా అధికంగా ఒక్క సీటు కూడా కేటాయించేది లేదని శిశసేన పట్టుదలతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత వారం మహరాష్ట్రకు వచ్చిన బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. శివసేనతో సీట్ల సర్థుబాటు కాకుంటే.. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లేందుకు కూడా సిద్దం కావాలని పార్టీ శ్రేణులతో అన్నారని సమాచారం. బీజేపీ, శివసేన సీట్ల సర్ధుబాటు విషయమై మీడియా అడిగిన ప్రశ్నపై స్పందించిన అమిత్ షా.. సీట్ల సర్దుబాటు కోసం ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టలేమని ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు.  
సీట్ల కేటాయింపుపై ఉద్ధవ్ థాక్రేదే అంతిమ నిర్ణయమని, శివసేన ఇచ్చేదే కానీ, ఒకరి నుంచి తీసుకునే పరిస్థితిలో లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్రంలో తమను అవమానించాలని ఎవరైనా చూస్తే వారు తగిన మూల్యం చెల్లించుకున్నవారు అవుతారని ఘాటుగానే చెప్పారు. కాగా, త్వరలోనే సీట్ల సర్ధుబాటు విషయంలో ఇరు పార్టీల మధ్య సఃయోధ్య కుదురుతుందని బీజేపి అధికార ప్రతినిధి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇరు పార్టీలు సీట్ల సర్ధుబాటు అంశాన్ని ఆత్మగౌరవ సమస్యగా పరిగణించకుండా పట్టు సడలించాలని కోరారు. మరోవైపు సీట్ల సర్థుబాటు విషయంలో శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే తన పార్టీకి చెందిన సీనియర్లతో సమావేశమయ్యారు. బీజేపితో కలసి వెళ్లాలంటే సగం స్థానాలు వారికి కేటాయించాలని, అలా కాని పక్షంలో బీజేపితో పోత్తుకు గుడ్ బై చెప్పి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లే విషయమై చర్చించనున్నట్లు సమాచారం.


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shiv Sena  BJP  Maharashtra  Sena-BJP alliance  Uddhav Thackeray  Sanjay Raut  Amit Shah  

Other Articles