Central minister nirmala sitaraman lost her bag

air india, air india flights, air india services, air india domestic flight service, air india international flights, air india ticket booking, air india flight charges, flight ticket bookings, indian airlines, nirmala sitaraman, central minister, latest news, australia

central commerce minister nirmala sitaraman lost her bag while travelling to australia : nirmala sitaraman bought new sarees in kerns city because of she lost her sarees bag in airindia flight

బట్టల బ్యాగు పోగొట్టుకున్న కేంద్రమంత్రి

Posted: 09/19/2014 01:52 PM IST
Central minister nirmala sitaraman lost her bag

ఎయిర్ ఇండియా సర్వీసులు ఎంత ఇబ్బందిగా ఉంటాయో తెలిపే ఉదాహరణ ఇది. ఇప్పటికే ఆ సంస్థ విమానాలు ఎక్కిన వారిని అనుభవాలు అడిగితే స్వయంగా వారి సున్నిత కష్టాలను చెప్తారు. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఎయిర్ ఇండియా విమానంలో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇందుకు కారణం ఆమె బ్యాగు పోవటం. ఆస్ర్టేలియా వెళ్తుండగా.., నిర్మలా బ్యాగు పోయింది. విమానంలో ఎవరు దొంగతనం చేశారో... లేక ఎక్కడ దొంగతనం జరిగిందో తెలియదు కానీ.. సిడ్నీ ఎయిర్ పోర్టులో చూసే సరికి బ్యాగు మాత్రం కన్పించలేదు.  కైర్న్స్ల్ లో జరిగే జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్ల సమావేశాలకు వెళ్తుండగా ఇది జరిగింది.

దీంతో తన కష్టాన్ని ట్విట్టర్ పిట్ట ద్వారా భారత దేశ మిత్రులకు పంపింది. ఇది చూసిన వారంతా అవాక్కయ్యారు. కేంద్రమంత్రి బ్యాగు పోయిందా? అంటూ కొందరు నవ్వుకుంటే.., మరికొందరు పాపం ఇప్పుడెలా అనుకున్నారు. ఇంతలో గంట సేపటి తర్వాత పిట్ట మరో సందేశం తెచ్చిపెట్టింది. అదేమంటే సీతారామన్ పోగొట్టుకున్న సూట్ కేసులోనే బట్టలన్నీ ఉన్నాయని.., తాను చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నట్లు తెలిపింది. గమ్యస్థానం అయిన కైర్న్స్ లో బట్టలు కొనుక్కుంటానని ఖచ్చితంగా చెప్పలేనంది. ఎందుకంటే బిజీ షెడ్యూల్ కాబట్టి ఎలా వీలవుతుందో చూడాలి అని తెలిపింది.

ఇది అవమానకర ఘటనగా భావించిన ఎయిర్ ఇండియా వర్గాలు.., బ్యాగుకోసం గాల్లో ఉన్న ఫ్లైటును అక్కడిక్కడే తనిఖీ చేశారు. చివరకు ఎలాగోలా బ్యాగును సంపాదించారు. వెంటనే ఎయిర్ ఇండియా మేనేజర్ మంత్రి బ్యాగు గుర్తించామని.., ఆమెకు వీలైనంత త్వరగా అందజేస్తామని చెప్పారు. ఇది భారత ప్రభుత్వ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా సేవలు. అంటే విమానాల్లో కూడా దొంగలు పడతారన్నమాట.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : air india  australia  nirmala sitaraman  latest news  

Other Articles