Omer abdullah comments on flood effects

jammu kashmir, jammu kashmir floods, kashmir floods, kashmir rain, natural disasters, floods, rains, earthquakes, latest news, omer abdullah, chief minister, mobile phones, new mobiles, charging problems, mobile chargers, kashmir tourism, army, indian air force, ndtv, national media

jammu kashmir chief minister omer abdullah says his government was digged in rain water including all departments : even my mobile in battery low with heavy rains and power cuts says jammu kashmir chief minister omer abdullah

‘సెల్’లో చార్జింగ్ లేదు మొర్రో అంటున్న సీఎం

Posted: 09/12/2014 01:42 PM IST
Omer abdullah comments on flood effects

ఇళ్ళు కాలి ఒకడు ఏడుస్తుంటే... ఇంకేదో కావాలన్నట్లుంది జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వ్యవహారం. భారీ వరదలతో రాష్ర్టం అతలాకుతలం అవుతుంటే ముఖ్యమంత్రి మాత్రం తన సెల్లో చార్జింగ్ లేదని.. చార్జర్ పట్టుకుని తిరుగుతున్నారు. ఓ జాతీయ మీడియాలో జరిగిన ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తన సెల్ ఫోన్ చార్జింగ్ అయిపోయిందనీ.., నెట్ వర్క్ కూడా లేదని వాపోయాడు. ఎవ్వరితో మాట్లాడే అవకాశమే లేకుండా పోయిందని తెలిపారు. ప్రజలకు అందిస్తున్న సహాయంపై సమాధానం చెప్పమంటే ఇలా మాట్లాడటంతో స్టూడియోలోని సీనియర్ జర్నలిస్టులతో పాటు.., వీక్షకులు కూడా ఆశ్చర్యపోయారు.

ప్రభుత్వమే మునిగిపోయింది

వరదల్లో చిక్కుకున్న ప్రజలకు అందిస్తున్న సాయం వివరాలు, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ఓ వార్తాచానెల్ అబ్దుల్లాను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్బంగా ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నకు.. ప్రభుత్వం ఎక్కడుందని ఎదురు ప్రశ్నించారు. సచివాలయం, పోలిసు విభాగాలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్ని నీట ముగినిపోతే ఇక తన ప్రభుత్వం ఎక్కడుంది.. ఎక్కడి నుంచి పరిపాలన చేస్తుందన్నారు. అదే విధంగా తాను ఒక చిన్న గదిలో కేవలం ఆరుగురు వ్యక్తులతో పనిచేస్తున్నా అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమూ.. పనితీరు ఎలా ఉంటుందన్నారు. పూర్తిగా ఆర్మీ సేవలు అందిస్తోందని వారిని కొనియాడారు.

సెల్ చార్జింగ్ లేదు

ఇక మంత్రులను, అధికారులను అప్రమత్తం చేయటంపై కూడా వింతగా సమాధానం ఇచ్చారు. వారిని అప్రమత్తం చేయటానికి సమాచార వ్యవస్థే లేదు కదా అని సింపుల్ గా చెప్పారు. కరెంటు లేక తన సెల్ లో కూడా చార్జింగ్ లేదనీ.., అంతేకాకుండా నెట్ వర్క్ కూడా దెబ్బతినటంతో సిగ్నల్ కూడా లేదని...ఇక ఎవరికి ఫోన్ చేయాలి అని సర్ధి చెప్పుకున్నారు. మంత్రులు, అధికారుల్లో కొంతమంది ఆచూకి తెలియదన్నారు. ఇప్పుడిప్పుడే కొందరు తనను కలుస్తున్నారని తెలిపారు. విపత్తు వచ్చినపుడు సాయం చేసే స్థితిలో లేకపోయినా కనీసం నైతిక స్థైర్యం ఇవ్వకుండా ఇలా వివాదాస్పదంగా ముఖ్యమంత్రి మాట్లాడటంపై జమ్మూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jammu kashmir floods  omer abdullah  mobile charging  latest news  

Other Articles