Al qaeda starts indian branch

al qaeda, osama bin lade, laden death, pakisthan, al jawahari, pakisthan news, terrorists, indian mujahidin, taliban, militants, america, obama, narendra modi, intelligence bureau, latest news, asim umar

terrorist organisation al qaeda started indian branch with asim umar as chief : jawahari announces al qaeda india branch

భారత్ లో ఆల్ ఖయిదా బ్రాంచ్

Posted: 09/04/2014 09:15 AM IST
Al qaeda starts indian branch

అమెరికాలోని ట్విన్ టవర్స్ పై దాడితో ప్రపంచాన్ని హడలెత్తించిన ఆల్ ఖయిదా తన ఉనికి చాటుకునేందుకు సిద్ధమవుతోంది. ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత తగ్గుముఖం పట్టిన సంస్థ కార్యకలాపాలను మళ్ళీ విస్తరించేందుకు వ్యూహం రచిస్తోంది. ఇందులో భాగంగానే భారత దేశంలో కూడా ఆల్ ఖయిదా శాఖను ప్రారంభిస్తున్నట్లు ఉగ్రవాద సంస్త ప్రస్తుత చీఫ్ ఆల్ జవహరి తెలిపారు. జవహరి ప్రసంగంతో ఈ మద్య విడుదలైన ఓ వీడియోలో ఆయన ఈ ప్రకటన చేశారు.

దేశంలో అన్యాయానికి, అణిచివేతకు  గురవుతున్న ముస్లింలకు అండగా ఉండేందుకు దేశంలో శాఖను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా భారత్ లో షరియా చట్టం అమలు చేయటం.., ఆక్రమణలకు గురైన ముస్లిం భూములను తిరిగి వారికి అప్పగించటం, వివక్షకు గురవుతున్న ముస్లింల తరపున పోరాడటమే తమ లక్ష్యమని జవహరి తెలిపారు. ప్రస్తుతం ఉగ్రవాద సంస్థలో షాక్ షరియా కమిటి వ్యవహారాలు చూస్తున్న అసిమ్ ఉమర్ భారత శాఖ చీఫ్ గా ఉంటారని జవహరి చెప్పారు. తమకు ఈ శాఖ ఏర్పాటు చేసేందుకు రెండేళ్ళ సమయం పట్టిందన్నారు.

అంటే లాడెన్ మరణించిన తర్వాత బాధ్యతలు చేపట్టిన జవహరి ప్రధానంగా సంస్త విస్తరణ.., కార్యకలాపాల పరిధి పెంచటంపై దృష్టి పెట్టారని తాజా వీడియో సందేశం స్పష్టం చేస్తోంది. రెండేళ్ళ పాటు సైలెంట్ గా ఉన్నా.., గ్రౌండ్ వర్క్ చేసినట్లు ఆయన మాటల ద్వారా అర్ధం అవుతోంది. ప్రదానంగా సంస్థ పరిధిని విస్తరించేందుకు ముస్లిం యువతను ఆకర్షించేలా వారికి వ్యక్తిగత సాయం ద్వారా ఆల్ ఖయిదా వైపు ఆకర్షితులయ్యేలా వ్యూహ రచన చేస్తున్నట్లు స్సష్టమవుతోంది. దేశంలో ఇండియన్ ముజాహిదీన్ సహా ఇతర ఉగ్రవాద సంస్థలు దాడులు చేయటంతో పాటు.., భారత యువకులతోనే దేశంపై యుద్ధం చేయిస్తున్నాయి. ఈ క్రమంలో ఆల్ ఖయిదా కూడా దిగితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే ఆల్ ఖయిదా సహా ఇతర ఉగ్రవాద సంస్థల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టినట్లు ఇంటలిజెన్స్ అధికారులు చెప్తున్నారు. వారి వ్యూహాలను సమర్ధంగా తిప్పికొడతామన్నారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Congress meeting at lb stadium
Chief secretary minnie mathew  
Rate This Article
(0 votes)
Tags : al qaeda  al jawahari  asim umar  latest news  

Other Articles