Bjp party plannings to join rajinikanth in their party as like pawan kalyan

super star rajnikanth, rajnikanth latest news, rajnikanth news, pawan kalyan, pawan kalyan latest news, pawan kalyan rajnikanth, pawan kalyan with rajnikanth, rajnikanth political entry, rajnikanth bjp party

bjp party plannings to join ranjikanth in their party as like pawan kalyan : bjp party plannings to join ranjikanth in their party as like pawan kalyan. Rajnikanth is also looking forward to join bjp party

పవన్ కల్యాణ్ లాగే వలలో చిక్కిపోయిన రజనీకాంత్!

Posted: 08/28/2014 10:26 AM IST
Bjp party plannings to join rajinikanth in their party as like pawan kalyan

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక హీరోగా కొనసాగుతున్నప్పుడు ఆయన కేవలం ఒక నటుడిగా మాత్రమే అందరికీ పరిచయం! అయితే ఎప్పటినుంచి ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చుకున్నారో అప్పటినుంచి దేశంలోనే మారుమోగిపోయారు. ఎక్కడ చూసినా ఈయన ప్రస్తావనే! ఎందుకంటే.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ - టీడీపీ పార్టీలకు మద్దతుగా ఆయన ప్రచారాలు చేసి.. ఆ పార్టీల ప్రతిష్టతను పెంచడంలో కీలకపాత్ర పోషించిన ఒక యువనాయకుడు! ఒక్కమాటలో చెప్పుకోవాలంటే.. ఈయన వల్లే టీడీపీ పార్టీ ఆంధ్రాలో గెలిచిందని చెప్పుకోవడంలో ఎటువంటి అనుమానాలు లేవని అనుకోవచ్చు. బీజేపీ - టీడీపీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి.. ఆ రెండింటిలో ఏది గెలిచినా ఒక్కటే! పవన్ కల్యాణ్ చొరవ చేసుకోవడం తమ పార్టీ విలువ పెరిగింది కాబట్టి... బీజేపీవాళ్లు పవన్ కల్యాణ్ కు ఒక ప్రత్యేక హోదాను కలిపించారు..!

ఇదిలావుండగా... తాజా రాజకీయ పరిణామాల ప్రకారం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పవన్ కల్యాణ్ బాటలోనే నడుస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ప్రత్యక్షంగా ఈయన రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించకపోయినా... పరోక్షంగా ఆ పార్టీ గురించి పొగిడిన సందర్భాలు వున్నాయి. ఆ పార్టీతో ఆయనకు బలంగా సంబంధాలు కూడా వున్నాయి. గతంలో మాజీ ప్రధాని వాజ్ పేయి నిధికి నదుల అనుసంధానం కోసం రజనీకాంత్ కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. మరోవైపు.. మొన్నటికి మొన్న ‘‘దేవుడు నిర్ణయిస్తే తాను రాజకీయాల్లోకి వస్తానని’’ పరోక్షంగా ఆయన పొలిటికల్ ఎంట్రీపై కామెంట్ చేసిన సంగతి కూడా తెలిసిందే! దీంతో రజనీకాంత్ కూడా పాలిటిక్స్ లో ఎంట్రీ అవడం ఖాయమని.. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ ఈయనకు వల వేస్తోందని వార్తలు జోరుగా అందుకుంటున్నాయి.

ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ లో పవన్ కల్యాణ్ తమ పార్టీ తరఫున ప్రచారాలు చేసి తమ పార్టీ ప్రతిష్టను పెంచారో... అలాగే రజనీకాంత్ ను కూడా ఆహ్వానించి తమ పార్టీ బలోపేతాన్ని పెంచుకోవడం కోసం బీజేపీ చకచకా పావులు కదుపుతోంది. ఎలాగూ ఆంధ్రాలో బీజేపీ సక్సెస్ అయిపోయింది.. ఇక తమిళనాడులో కూడా అదేవిధంగా పాగా వేయడం కోసం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. అయితే ముందుగా తమ పార్టీ బలాన్ని ఒకేసారి పెంచుకోవాలంటే అందుకు తమ వలలో ఒక పెద్ద చేపను పట్టుకోవాల్సి వుంటుంది. తమిళనాడు మొత్తంగా వలవేసి చూస్తే అందులో రజనీకాంత్ వీరికి వెన్నముకలా కనిపించారు. దీంతో ఆయనను ఎలాగైనా తమ పార్టీలోకి లాగేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. పవన్ కల్యాణ్ స్వతహాగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చుకున్నప్పటికీ.. ఆయన ప్రచారం చేసింది మాత్రం బీజేపీ-టీడీపీ కోసమే! అంటే.. బీజేపీ వాళ్లు పవన్ కల్యాణ్ ఎలా ఉపయోగించుకుని తమ పార్టీ బలాన్ని పెంచుకున్నారో.. అలాగే తమిళనాడులో రజనీకాంత్ సహాయంతో తమ పార్టీని విస్తరింపచేయాలని భావిస్తోంది.

ఇందులోభాగంగా ఎన్నికల నేపథ్యంలో స్వయంగా మోడీయే, రజనీకాంత్ ను కలవడానికి చెన్నై వచ్చారు. అలాగే ప్రధాని అయిన అనంతరం ఆయన తన సన్నిహితుడు అమిత్ షాను రంగంలోకి దింపి.. రజనీని ఎలాగైనా పార్టీలోకి తీసుకురావాల్సిందిగా ప్రయత్నాలు చేయాల్సిందిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కూడా చెన్నైకు విచ్చేసి రజనీని కలుసుకున్నారు. పైగా తమిళనాడులో డీఎంకే, ఏడీఎంకేలు నువ్వానేనా అంటూ జుట్టుపీక్కుంటున్న తరుణంలోనే రజనీని తెరపైకి తీసుకువస్తే తాము గెలవడం ఖాయమని బీజేపీ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ అధ్యక్షురాలు సౌందరరాజన్ పార్టీని బలోపేతం దిశలో చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే రజనీపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు చేశారు. రజనీకాంత్ కు తాము గాలం వేయాల్సిన అవసరం లేదని.. ఆయన మావాడేనంటూ ఆమె చెప్పారు. ఇన్ని విషయాలను గమనిస్తుంటే.. రజనీకాంత్ కూడా పవన్ కల్యాణ్ లా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : super star rajnikanth  pawan kalyan  bjp party  tamilnadu government  amit shah  narendra modi  

Other Articles