3 school teachers are suspended for not teaching students

kurnool district, kurnool news, school teachers, school teachers news, school teachers suspended, tdp party

3 school teachers are suspended for not teaching students : the 3 techers in kurnool district has done new crime that they taught the lessions by other teachers

పాఠాలు చెప్పకుండా వెర్రిచేష్టలు చేసిన టీచర్లు!

Posted: 08/27/2014 06:55 PM IST
3 school teachers are suspended for not teaching students

(Image source from: 3 school teachers are suspended for not teaching students)

ఈమధ్యకాలంలో స్కూల్ టీచర్ల నిర్వాకాలు చాలా ఎక్కువయిపోతున్నాయి. కొన్నిచోట్లలో కొంతమంది వ్యవసాయం, వ్యాపారాలు వంటివి చేసుకుంటూనే ఉపాధ్యాయులుగా చెలామణీ అవుతున్నవాళ్లు వుంటే... మరికొంతమంది తమకే చదువు రాకపోయినాగానీ టీచర్లుగా కొనసాగుతూ పిల్లలకు పాఠాలు చెబుతుంటారు. apple స్పెల్లింగ్ తెలియకాపోయినా... అక్కడి ప్రభుత్వాలు వాళ్లకు బీఈడీ పట్టా పొందినట్లు ఆమోదముద్రలు వేసిన సంఘటనలు వున్నాయి. ఇవి దేశంమొత్తం మీద ఎంత పెద్ద దుమారాన్నే రేపాయో అందరికీ తెలిసిందే! ఇంకొన్ని చోట్ల అయితే పిల్లలకు కొట్టడం, అత్యాచారాలు చేస్తూ పట్టుబడిన ఉపాధ్యాయులు వున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే కోకొల్లుగా ఉపాధ్యాయుల నిర్వాకాలు బయటపడుతూనే వుంటాయి.

ఇదిలావుండగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం రాచర్లలో ముగ్గురు టీచర్లు ఒక విచిత్ర కుంభకోణం చేస్తూ పట్టుబడ్డారు. అదేమిటంటే.. ఆ ముగ్గురు టీచర్లు తమకు బదులుగా మరో ముగ్గురు పిల్లల ద్వారా పాఠాలు చెప్పిస్తున్నారు. ఈమేరకు ఆ ఉపాధ్యాయుల నిర్వాకంపై వారి పైఅధికారులకు కొంతమంది ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఫిర్యాదును అందుకున్న అధికారులు.. ఈ విషయమై తనిఖీ చేయగా.. వారి నిర్వాకం వాస్తవమేనని నిర్థారణ చేశారు. దీంతో ఆ ముగ్గురు టీచర్లను అప్పటికప్పుడే సస్పెండ్ చేసేశారు. ఇదీ అండి మన భారతదేశం.. చదువులు చెప్పండిరా బాబూ అంటే.. తమ సోకులు చూసుకోవడానికే సమయం సరిపోయిందని సెటైర్లు వేసుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : school teachers  school teachers news  school teachers suspended  

Other Articles