Revanth reddy controversial comments on kcr

revanth reddy, jagga reddy, kcr, revanth reddy press meet, jagga reddy press meet, cm kcr latest news, jagga reddy bjp party, bjp party ministers, trs party leaders, medak mp seat, medak mp by elections, medak mp seat elections

revanth reddy controversial comments on kcr : tdp leader revanth reddy comments on kcr that jaggareddy is the right person to defeat kcr in medak district

కేసీఆర్ కు సరైన మొగుడు జగ్గారెడ్డి!

Posted: 08/28/2014 10:35 AM IST
Revanth reddy controversial comments on kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మెదక్ జిల్లా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాష్ రెడ్డిల మధ్య విభేదాలున్నాయని అందరికీ తెలిసిందే! మొదట టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగానే పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం... కేసీఆర్ అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ ఆయన కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిపోయారు. అంతే! అప్పటినుంచి ఆయన కేసీఆర్ నే లక్ష్యం చేసుకుని వీలుదొరికినప్పుడల్లా ఆయనపై విమర్శలు చేస్తూ వచ్చారు. కేసీఆర్ ఎన్నో అక్రమాలకు ఒడిగడుతున్నాడని.. పార్టీ టిక్కెట్లను అమ్ముకుంటున్నాడని జగ్గారెడ్డి చేసిన కామెంట్లు కోకొల్లలు! మొత్తంగా చెప్పాలంటే.. మెదక్ జిల్లా పదేళ్ల రాజకీయాల్లో ఒంటరిగానే పోరాడుతూ జగ్గారెడ్డి తన ప్రతిభతో పార్టీని నడుపుకుంటూ వచ్చారు.

అయితే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా ఎక్కువగా కొనసాగడంతో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలయ్యింది. దీంతో మెదక్ జిల్లా ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన ఆయన.. తన ఓటమిని అంగీకరించకుండా కాంగ్రెస్ పార్టీనీ వీడి బీజేపీకి చేరువయ్యారు. దీంతో ఆ పార్టీ ఈయనను మెదక్ జిల్లా లోక్ సభ ఎంపీ ఉపఎన్నికల బరిలోకి దించేసింది. అంటే.. మరోసారి ప్రత్యక్షంగా జగ్గారెడ్డి, కేసీఆర్ ల మధ్య హోరాహోరీ పోరాటం సాగనుంది. జగ్గారెడ్డి కూడా తాను ఎట్టిపరిస్థితుల్లోనూ గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తుండగా.. కేసీఆర్ తమ పార్టీయే గెలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇక్కడి రాజకీయ పరిణామాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయాయి. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ రాజకీయనేతల్లో వుండిపోయింది.

ఇదిలావుండగా... ఈ ఎన్నికల నేపథ్యంలో ‘‘కేసీఆర్ కు జగ్గారెడ్డియే సరైన మొగుడు’’ అంటూ మెదక్ టీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. నిజాయితీగా ఉద్యమంలో పాల్గొన్న వారిని కేసీఆర్ పక్కనపెట్టేసి.. తనకు కోట్లరూపాయలు సమర్పిస్తున్న వారికే ఎన్నికల్లో ఆయన టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఇందుకు బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డిలే ఉదాహరణలంటూ ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ లాంటి అక్రమ నేతను ఓడించడానికి జగ్గారెడ్డి లాంటి నాయకుడే సరైన మొగుడంటూ ఆయన పేర్కొన్నారు.

మెదక్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాల్లో తిరిగి.. కేసీఆర్ బండారాన్ని బయటపెడతానని రేవంత్ హెచ్చరించారు. టీఆర్ఎస్ నేతల ఆగడాలను మెదక్ లో కేసీఆర్ కు మొగుడులాంటి జగ్గారెడ్డిని బీజేపీ - టీడీపీ కూటమి అభ్యర్థిగా నిలబెట్టామని అన్నారు. కేసీఆర్ సింగపూర్ కి వెళ్లింది సింగారించుకోవడానికేనంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ను కేసీఆర్ సింగపూర్ చేయలేరని... అయితే హైదరాబాద్‌ను అమ్మి సింగపూర్‌ను కొనగల సత్తా ఆయనకు ఉందని రేవంత్ చురకలంటించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  jagga reddy  kcr  medak elections  lok sabha elections  

Other Articles