Sonia gandhi fires on modi government

sonia gandhi, rahul gandhi, upa, congress party, inc, aicc, rajiv gandhi, indira gandhi, rajiv assasination, indira death, nehru, gandhi, woman reservation, 33% reservation, narendra modi, prime minister, bjp, nda, rajnath singh, rss, latest news, political news

sonia says some individuals laid out a trap in which people stucked : some individuals trapped people and sold out their fake dreams says sonia on modi

వలలో చిక్కుకుపోయిన ప్రజలు

Posted: 08/20/2014 01:19 PM IST
Sonia gandhi fires on modi government

జయంతి రోజైన ఇవాళ విమర్శలు ఎక్కుపెట్టారు. దేశ ప్రజలను మోడిలాంటి వ్యక్తులు మోసం చేశారన్నారు. కొందరు వ్యక్తులు పన్నిన వలలో వాస్తవాలు తెలుసుకోకుండా దేశ ప్రజలు చిక్కుకుపోయారని ఆరోపించారు. అంతేకాకుండా అబద్దపు కలలను అమ్మేసుకుని కాలం వెల్లదీస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలు, ఓట్ల కోసం తమ పార్టీ ఎప్పుడూ సిద్ధాంతాలు వదులుకోలేదన్నారు. జీవితంలో గెలుపోటములు సహజమని.., అయితే ఎవరు వాటికి అతీతంగా సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారనేది ముఖ్యమన్నారు. విలువలు పోయిన రోజు మనిషి బతికున్నా మరణించినట్లే లెక్క అని హితబోధ చేశారు.

దివంగత మాజి ప్రధాని రాజివ్ గాంధీ 70వ జయంతి సందర్బంగా వీర్ భూమిలోని రాజీవ్ సమాధికి నివాళి అర్పించారు. దేశంలో సగబాగంగా ఉన్న మహిళల అభివృద్ధి జరగనిదే భారత దేశం వృద్ధి సాధించదన్న రాజీవ్ మాటలను గుర్తు చేశారు. దివంగత నేత ఆశయాలు, లక్ష్యాలు ఎప్పుడూ మనతో ఉంటాయన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికి మహిళా బిల్లు ఆమోదం పొందేలా ఎన్డీఏపై ఒత్తిడి తెస్తామన్నారు. బిల్లు ఆమోదం పొందే వరకు విశ్రమించమని స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ దేశానికి 7వ ప్రధానిగా 31/10/84 - 02/12/89 వరకు పనిచేశారు. 46ఏళ్ళ వయస్సులో తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఎల్టీటీఈ అనుచరులు రాజీవ్ ను హత్య చేశారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia gandhi  rajiv gandhi  modi  nda government  

Other Articles