Seven machines for andhrapradesh development

yanamala, ap budget, ap ministry, ap ministers, telangana ministers, ap government, telanagana govenment, chandrababu naidu, kcr, ap assembly, jagan, ycp, congress, tdp, bjp, mim, cpi, ap latest news, 7 machines, aiims

yanamala says 7 machines will introdeced to develope ap : with 7new machines ap will develope says yanamala

ఏపీ కోసం 7 మిషన్లు, ఎయిమ్స్

Posted: 08/20/2014 12:50 PM IST
Seven machines for andhrapradesh development

ఏపీ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆ రాష్ర్ట ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రతి ఊరికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలను సమన్వయం చేసి సమగ్ర అభివృద్ధి సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక ఏపీ సత్వర ప్రణాళిక కోసం ఏడు మిషన్లు అమలు చేస్తామని చెప్పారు. అవి సమాజిక సాధికార మిషన్, సేవా రంగ మిషన్ వంటి 7 మిషన్లు ఏపీ కోసం పని చేస్తాయని ప్రతి మిషన్ కు ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారని చెప్పారు. సంబందిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు ఇందులో సభ్యులుగా ఉండే అవకాశముంది. త్వరలోనే ఏపీలో ఎయిమ్స్ ప్రారంభం అవుతుందని చెప్పారు. పవన, సౌర విద్యుత్ అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఇక రూ. 1,11,884 కోట్ల ఏపీ బడ్జెట్ హైలైట్స్ ఇలా ఉన్నాయి.

ఏపీ బడ్జెట్ హైలైట్స్ ::-

వ్యవసాయినికి 9గంటల నాణ్యమైన విద్యుత్

మైక్రో ఇరిగేషన్ తో పొలాలకు అవసరమైన చోట నీరు

గ్రామాలకు త్రీఫేజ్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు

24గంటల విద్యుత్ సరఫరా పైలట రాష్ర్టంగా ఏపీ ఎంపిక

మచిలీపట్నం రేవు పనులు వేగవంతం

కాకినాడలో మరో పోర్టు నిర్మాణంకు కృషి

విశాఖ, విజయవాడల్లో విమానాశ్రయాల విస్తరణ

త్వరలో ఏపీలో ఎయిమ్స్ ప్రారంభం

చిత్తూరు జిల్లాకు ఐఐటీ

పీపీపీ పద్దతిలో కాకినాడకు మరో ఐఐటి

రైల్వేక్రాసింగ్ దగ్గర గేట్ల ఏర్పాటుకు చర్యలు

పరిశ్రమల అనుమతులకు సింగిల్ విండో విధానం

ఇండస్ర్టియల్ పార్కుల స్థాపనపై ప్రత్యేక దృష్టి

కమ్యూనికేషన్, ఐటి అభివృద్ధికి విధానపత్ర రూపకల్పన

ఐటీలో ఏపీకి ప్రపంచ గుర్తింపు తెచ్చేలా కృషి

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap budget  latest news  assembly  yanamala  

Other Articles