ఇరాక్ లో ఉగ్రవాదుల ఆగడాలు రోజురోజుకూ శృతిమించుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలను ఆక్రమించుకుని సమాంతర పాలన నడుపుతున్న isis ఉగ్రవాదులు తమపై దాడులు చేస్తున్న అమెరికాపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అగ్రరాజ్యంపై తమ కోపాన్ని ఓ అమెరికా జర్నలిస్ట్ ను దారుణంగా హత్య చేసి ప్రపంచానికి చూపారు. అమెరికాకు చెందిన జేమ్స్ ఫాలే అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టును జీహాదీలు అతి దారుణంగా గొంతుకోసి తల మొండెం వేరు చేసి హత్య చేశారు. ఈ వీడియోను సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పెట్టి అమెరికాను హెచ్చరించారు. దాదాపు ఐదు నిమిషాలున్న ఈ వీడియోలో ముసుగు వేసుకున్న ఓ ఉగ్రవాది కత్తి చేతపట్టి, జేమ్స్ ను బంధీగా ఉంచాడు. ఒబామా ప్రభుత్వం తమ దేశంపై చేస్తున్న దాడులపై తీవ్రంగా మండిపడ్డాడు. ఇస్లామిక్ దేశం జోలికి వస్తే సహించబోమని చెప్పాడు. ఒబామా విధానాలకు నిరసనగా జర్నలిస్టును హత్య చేస్తున్నట్లు చెప్పి.., అతి దారుణంగా గొంతు కోసాడు. ఈ వీడియోను " A message to america " అనే పేరుతో సోషల్ మీడియా సైట్లలో పెట్టారు. ఇప్పటికైనా ఒబామా వెనక్కి తగ్గకుంటే తమ వద్ద ఉన్న మరో జర్నలిస్టు పరిస్థితి కూడా ఇలానే ఉంటుందని హెచ్చరించారు.
అమెరికాకు చెందిన జేమ్స్ పాలో గ్లోబల్ పోస్ట్, ఏజన్సీ ఫ్రాన్స్ ప్రెస్ (AFP) తో పాటు ఇతర మీడియా సంస్థలకు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేశాడు. సిరియా అంతర్యుద్ధం సమయంలో కవరేజికి వెళ్లి 2012 నుంచి కనబడటం లేదు. అప్పటి నుంచి ఉగ్రవాదులు బంధీగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. అటు ఈ వీడియోలో చనిపోయే ముందు చివరి నిమిషంలో మాట్లాడిన జేమ్స్.., అమెరికా ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించాలన్నారు. తన హత్యను చూపి అమెరికా ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే సోదరుడు ప్రభుత్వం వద్ద ఎలాంటి పరిహారం పొందవద్దని కోరాడు. తనలాగే మరో జర్నలిస్టు పరిస్థితి కాకుండా ఒబామా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరమందన్నాడు. చనిపోయే ముందు.., చివరి నిమిషంలో కూడా జేమ్స్ మొహంలో ఎలాంటి భయం, బాధ కన్పించలేదు. ఈ వీడియో చూసిన వారంతా జిహాదీల దారుణాల పట్ల మండిపడుతున్నారు. వారు పద్దతి మార్చుకోవాలని సూచిస్తున్నారు.
కార్తిక్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more