All indians are hindus says mohan bhagawat

mohan bhagawat, rss, hindus, indians, mohan bhagawat comments on hindus india

rss chief mohan bhagawat says all indians are hindus : but cpi raja opposes his comments

భారతీయులంటే హిందువులు

Posted: 08/11/2014 12:55 PM IST
All indians are hindus says mohan bhagawat

కులాలు, మతాలు, జాతులు, వర్గాలు. సమాజంలోని వ్యక్తుల మద్య విభజనలు తేవటంలో ఇవి ముందుంటాయి. ఈ మద్య ప్రాంతీయ వాదాలు కూడా వ్యక్తుల మద్య విభజనలు తెస్తున్నాయి. రాష్ర్టీయ స్వయం సేవక్ వంటి సంస్థలు ఐక్యత కోసం క్రుషి చేస్తున్నాయి. అయితే వారి విధానాలు పూర్తిగా ఒక వర్గానికి అనుకూలంగా ఉంటాయని అందరికీ తెలుసు. ప్రత్యేకించి ఒక వర్గాన్ని టార్గెట్ చేసి నేతలు మాట్లాడతారని కూడా తెలుసు. తాజాగా భారతీయతపై ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. దేశంలో కులం, మతం అనేవి లేవనీ.., అందరూ సమానమే అని చెప్పారు. అదెలాగంటే ఇంగ్లాండ్ లో ఉండే వారు ఇంగ్లీషు వారు అయితే, జర్మనీలో ఉండే వారు జర్మన్ లు అయినప్పుడు భారతదేశంలో ఉండే వారు భారతీయులేనన్నారు. ఇది నిజమే ఈ మాటలను ఎవరూ కాదనరు. అందరూ ఒప్పుకుంటారు. అయితే భగవత్ గారు భారత దేశం అనలేదు. హిందుస్థాన్ అన్నారు. అంటే  హిందుస్థాన్ లో ఉండేవారంతా హిందువులేనని.

భారతీయులందరిదీ ఒకే సాంప్రదాయమనీ.., అదే హిందుత్వమని సెలవిచ్చారు. ప్రజలంతా గొప్ప సంస్ర్కుతి, సాంప్రదాయాల  వారసులన్నారు. భిన్నత్వంలో ఏకత్వం, సర్వమత సమ్మేళనం అని అందరూ చెప్తుంటే అంతా ఒకే మతం అదే హిందుత్వం అని మాట్లాడి భగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ జాతి, మతంను గౌరవించుకోవటాన్ని అందరూ ఒప్పుకుంటారు. అయితే ఇతర మతాలు, వర్గాలను విమర్శిస్తే, చిన్న చూపు చూస్తే ఎంతటి వారికైనా కోపం వస్తుందన్న విషయం తెలిసి కూడా ఆయనిలా మాట్లడుతున్నారు.

హిందుత్వం

ఇక హిందుత్వం గురించి మోహన్ భగవత్ చాలా బాగా చెప్పారు. అన్ని వర్గాలకు హిందుత్వమే ఆదర్శమని, అదే జీవనమార్గమని భోదించారు. ఎవరు ఏ మతాన్నిఎంచుకున్నా.., ఏ విధానాలు పాటించినా అందులో హిందుత్వం ఉంటుందన్నారు. దేశంలోని కొంతమంది ఈ విషయాలను అంగీకరించరని.., తనలాంటి వారిపై మతం ముద్ర వేసి విమర్శిస్తుంటారని చెప్పారు. తరుచుగా తనకు ఇలాంటి ఘటనలు ఎదురయినట్లు వివరించారు. అంతేకాదు అంతా చెప్తున్నట్లు దేవుడిని నమ్మని వాడు నాస్తికుడు కాదన్నారు. తనపై తనకు నమ్మకం లేని వ్యక్తులు నిజమైన నాస్తికులుగా వివరించారు.

ప్రపంచాన్ని చీకట్లు కమ్మాయి!!    

ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలు, వింత పోకడలతో ప్రపచంలో చీకట్లు అలముకున్నాయని మోహన్ భగవత్ అన్నారు. యావత్ ప్రపంచం ఓదార్పు కోసం భారత్ వైపు చూస్తోందన్నారు. మన దేశంలో ఉన్న సనాతన సాంప్రదాయాలు, దర్మ పరివర్తన వల్లనే ప్రపంచం ఆసక్తిగా భారత్ ను గమనిస్తోందన్నారు. ఎప్పుడైతే దేశంలో దర్మం కనుమరుగవుతుందో.., అప్పుడు ఏ శక్తి కూడా దేశాన్ని కాపాడలేదన్నారు.

హిందూ రాజ్యాంగం కాదు, లేదు- సీపీఐ నేత రాజా     
కులం లేదు, మతం లేదు ప్రజలంతా సమానులే అని భావించే కమ్యూనిస్టు పార్టీలకు మోహన్ భగవత్ మాటలు రుచించటం లేదు. సమాజాన్ని మతం ఆధారంగా విభజించటం, బలవంతంగా రుద్దటం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. భారత దేశంలో హిందుత్వ రాజ్యాంగం అమల్లో లేదని, మనది హిందూ రాజ్యాంగం కాదని సీపీఐ నేత రాజా స్పష్టం చేశారు. భగవత్ వంటి వ్యక్తుల మాటలు దేశాన్ని విభజించేలా ఉంటాయని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఆర్ఎస్ఎస్ ఇకనైనా మానుకోవాలని రాజా సూచించారు.

RK

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mohan bhagawat  hindus  india  latest news  cpi leader d.raja  

Other Articles