No ebola case in india health minister doctor harsh vardhan says

Health Minister Harsh Vardhan, India on alert for Ebola virus, No Ebola case in India, Ebola virus, Ebola virus effects, Ebola, Ebola virus in world,

No Ebola case in India health minister doctor Harsh Vardhan says: No case of Ebola virus has been reported in India so far and the ... measures to prevent its spread, health minister Harsh Vardhan said on Friday

మంత్రి హర్షవర్థన్ ‘ఎబోలా’హమీ?

Posted: 08/08/2014 06:30 PM IST
No ebola case in india health minister doctor harsh vardhan says

మనం ప్రమాదం జరిగిన తరువాత ప్రయోగాలు చేస్తాం అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్షన్ గుర్తు చేశారు. ఎబోలా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిందే. ఎబోలా భారత్ వైపు వేగంగా వస్తుందని కొన్ని దేశాలు .. ముందస్తు హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. ఆయా దేశాలు .. ఎబాలో వైరస్ ను తమ దేశం ప్రజలకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ మన దేశంలోని అధికారులు, మంత్రలు.. ‘ఎబోలా’ వైరస్ పై చావు సలహాలు ఇస్తున్నారు.

‘‘ప్రమాదం పది అడుగుల దూరంలో ఉంది .. కాపాడండి అని అంటే..’’ పర్వలేదు .. పది అడుగులు దూరంలో ఉందిగా ఎలాంటి నష్టం జరగదులే.. అని ఏసీ గదుల్లో ఉండి.. మీడియా ప్రకటనలు చేస్తారు. ఇప్పుడు మన ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ కూడా అదే అంటున్నారు.

శరవేగంతో విస్తరిస్తున్న ఎబొలా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, భారత్ లో ఎబోలా కేసులేవీ నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. ఎబొలా ప్రభావిత దేశాల నుంచి భారత్ కు వచ్చే వారిపై పరిశీలన ఉంటుందని తెలిపారు.

అయ్యా మంత్రి గారు.. ఎబోలా వైరస్ అనేది .. నేను వస్తున్నా మీరు జాగ్రత్త అని చెప్పి రాదు. ఒకవేళ ఎబోలో వైరస్ ఎటాక్ చేసిన తరువాత మనిషి ప్రాణం .. కొన్ని రోజులే. !! ఎబోలా వైరస్ అర్థరాత్రి అరవై కిలో మీటర్ల వేగంతో వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. మీరు ఇలా నిమ్మకు నీరుపట్టిన ఉంటే.. ప్రమాదం జరిగిన తరువాత .. లెక్కలు వేయటానికి అధికారులు కూడా కరువవుతారు. థటీస్ ఎబోలా వైరస్..!! భారత్ ప్రజలు బీ కేర్ పుల్ ..!!

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles