Ex minister danam nagender warning to trs party

ex minister danam nagender, danam warning to trs party, danam warning to cm kcr, trs party, congress party, trs leaders vs danam, telangana congress leader danam

ex minister danam nagender warning to trs party: Danam Nagender sent out clear warnings to KCR .

ఇబ్బంది పెడతా: దానం

Posted: 08/08/2014 04:30 PM IST
Ex minister danam nagender warning to trs party

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి దానం నాగేందర్ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత.. అంతగా కనిపించటంలేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. అప్పుడప్పుడు మీడియా కనిపిస్తూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు.

అదే తెలంగాణ కాంగ్రెస్ నేతలపై గులాబీ సైన్యం మాటల యుద్దం చేస్తుంది. ఇప్పటి వరకు మాజీ మంత్రి దానం పై గులాబీ సైన్యం ఎలాంటి కామెంట్లు చేయలేదు. దానం మాత్రం తన పని తాను చేసుకుంటున్నారు. కానీ ఇటీవల కాలంలో దానం నాగేందర్ టీఆర్ఎస్ పార్టీ లోకి చేరతాడంటూ వార్తలు వచ్చాయి. ఇలాంటీ వార్తలపై దానం నాగేందర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఈరోజు తనపై టీఆర్ఎస్ ఆశలు వదులకోవాల్సిదేనని దానం నాగేందర్ తెలిపారు.

హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తనకు పార్టీ మారే ఆలోచన లేదని అన్నారు. పార్టీ మారడం లేదని తనను టీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూస్తే తాను టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతానని ఆయన హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే తెలంగాణ ప్రజలే కేసీఆర్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని దానం తెలిపారు.

సమగ్ర సర్వేలో ఆటో డ్రైవర్లు, కూలీల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. విధులు మానేయాలన్న ప్రభుత్వం ఆ రోజు అందరికీ సెలవు ప్రకటించినట్టు సర్వేలో పాల్గొన్న వారందరికీ భత్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles