Dead man alive in post mortem maharashtra lathur goverment hospital

dead man alive, post mortem, dead man alive post mortem, maharashtra lathur goverment hospital, police sub inspector, doctors in hospital

dead man alive in post mortem maharashtra lathur goverment hospital : A dead man alive when the doctor doing post mortem of his body in maharasthra lathur hospital.

చచ్చాడని పోస్టుమార్టం చేస్తుంటే.. లేచి డాక్టర్లని భయపెట్టాడు!

Posted: 08/07/2014 12:35 PM IST
Dead man alive in post mortem maharashtra lathur goverment hospital

ఆమధ్య ఫిలిప్పీన్స్ లో ఒక చిన్నార మరణించి, తిరిగి మళ్లీ బతికిందన్న వార్తను మనం వీడియో ద్వారా కళ్లారా వీక్షించిన సంగతి తెలిసిందే! ఆ సంఘటనతో ప్రపంచం మొత్తంమీద వున్నవారందరూ ఒకేసారి షాక్ కు గురయ్యారు. ఇదెలా సాధ్యమంటూ బీపీ ట్యాబ్లెట్ల కోసం డాక్టర్లు పరుగులు తీశారు. ఆ బాలిక కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కానీ ఆ సంతోషం కొన్ని రోజులకే పరిమితం అయింది. ఆ బాలిక తీవ్ర జ్వరంతో మరణించింది.

ఇదిలావుండగా... తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఓ 50 ఏళ్ల వ్యక్తి.. రైలు నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ నేపథ్యంలోనే అతడు స్పృహ కోల్పోయాడు. దీంతో అక్కడున్న స్థానికులు వెంటనే అతన్ని లాతూర్ లోని ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స చేయడానికి వచ్చిన డాక్టర్లు అతడు మరణించాడు నిర్ధారించారు. శరీరంలో కదలికలు లేకుండా పూర్తిగా స్పృహ కోల్పోయిన స్థితిలో వుండటం వల్ల డాక్టర్లు ఆ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. అంతే! అతని పోస్టుమార్టం కోసం అన్ని కార్యక్రమాలు సిద్ధం చేశారు.

వైద్యులు ఆ వ్యక్తి పోస్టుమార్టం నిమిత్తం అతని మృతదేహాన్ని గదిలోకి తీసుకెళ్లారు. అతని పోస్టుమార్టం కోసం కేవలం కొన్ని క్షణాలు మాత్రమే వున్నాయి. అయితే ఉన్నట్లుండి ఆ బాధితుడి శరీరంలో కదిలికలు వచ్చినట్లు అక్కడే వున్న ఒక సబ్ ఇన్స్ పెక్టర్ గుర్తించి, వైద్యులకు తెలిపాడు. ‘‘ఇదెలా సాధ్యమవుతుంది..?’’ అంటూ ఆందోళనల్లో మునిగిపోయిన సదరు డాక్టర్లు... ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి దీర్ఘంగా గమనించిగా అతని శరీరం కదలికలు చేసింది. అంతే! ‘‘ఓరి నాయనోయ్.. ఇదేం మిరాకిల్ రా బాబు’’ అంటూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చివరికి ఆ వ్యక్తి మరణించలేదని వైద్యపరీక్షలు చేసి తాపీగా తేల్చారు. అక్కడే వున్న సబ్ ఇన్స్ పెక్టర్ ఈ విషయాన్ని గనుక గుర్తించకపోయి వుంటే ఆ వ్యక్తి మరణించడం ఖాయం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles