China city bans big beards or islamic clothing from buses

china Bans Big Beards, china Bans Burqa, bans big beards from buses, Islamic clothin from buses,

China city bans big beards or Islamic clothing from buses: A city in China's mainly Muslim Xinjiang region has banned people with large beards or Islamic clothing from travelling on public buses

ఇక పొడవాటి గడ్డాలు-ముఖానికి ముసుగులు నిషేదం!

Posted: 08/07/2014 11:27 AM IST
China city bans big beards or islamic clothing from buses

నిన్న సౌదీ అరేబీయ దేశం.. తమ దేశంలోనే మగవారికి కొన్ని అంక్షలు పెట్టింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, చాద్, మయన్మార్ దేశాలలోనే అమ్మాయిలను ఎవరు పెళ్లి చేసుకోవద్దు అంటూ.. ఒక ప్రకటన చేసింది. ఇప్పుడు అదే బాటలో చైనా కూడా నడుస్తుంది. కొంచె డిఫరెంట్ గా చైనా ప్రకటన చేసింది. ఇక నుండి తమ దేశంలో పొడవాటి గడ్డాలు, ముఖానికి ముసుగులు, బుర్ఖాలు లను ధరించరాదు.

అంతేకాదు .. నెలవంక ఉన్న గుర్తును అసలు వాడరాదు. ముఖ్యంగా ఇస్లామిక్ తీవ్రవాదం పట్ల అక్కడ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిన్ ఝియాంగ్ ప్రావిన్స్ లోని కరామాయ్ నగరంలో తీవ్ర ఆంక్షలు విధించారు. అంతేకాకుండా వీటిని ధరించి బస్సుల్లో ప్రయాణించడంపై నిషేధం విధించారు. ఈ చిహ్నాలన్నీ ఇస్లామ్ కు సంకేతాలని చైనా అధికార వర్గాలు భావిస్తుండడమే నిషేధానికి కారణం.

బస్సులే కాకుండా ఇతర ప్రజా రవాణా వ్యవస్థకు చెందిన వాహనాల్లోనూ ఇలాంటి వ్యక్తులు ప్రయాణించడాన్ని ఇకపై అనుమతించరు. ఆగస్టు 20న జరిగే స్థానిక క్రీడా పోటీలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నా, ఆ తర్వాత కూడా ఈ నిషేధాజ్ఞలను పొడిగించే అవకాశాలున్నాయి.

జులైలో జిన్ ఝియాంగ్ ప్రావిన్స్ లోని రెండు పట్టణాల్లో టెర్రరిస్టులుగా భావిస్తున్న కొందరు వ్యక్తులు కత్తులతో స్వైర విహారం చేశారు. పోలీసులు ఈ దాడిపై వెంటనే స్పందించారు. ఆ ఘటనల్లో 100 మంది చనిపోగా, వారిలో 59 మంది టెర్రిస్టులు కూడా ఉన్నారు. అంతకుముందు మే నెలలో ఉరుంఖీ పట్టణంలోని ఓ మార్కెట్ వద్ద ఆత్మాహుతి దాడి జరగడంతో 39 మంది మరణించారు. ఈ హింసాత్మక ఘటనల నేపథ్యంలోనే ఆంక్షలు విధించినట్టు అర్థమవుతోంది.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles