India beats china in product and service department

india beats china, indian product service department, international hsbc bank, emerging market index survey, china product service department, india china news

India Beats china in product and service department : for the first time India beats china in product and service department with 53 percent while china enrolled just 51.3

చైనా మీద భారత్ సంచలన విజయం!

Posted: 08/07/2014 01:08 PM IST
India beats china in product and service department

ఇక్కడ భారత విజయం సాధించింది దేశప్రజల విషయంలో కాదులెండి..! ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో దూసుకుపోతూ ఎప్పుడూ మొదటిస్థానంలో వుండే చైనా వంటి దేశాన్ని మన భారతదేశం మొదటిసారిగా ఓడించింది. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా.. ఇది మాత్రం నిజం! అంతర్జాతీయ బ్యాంక్ హెచ్ఎస్బీసీ తాజాగా విడుదల చేసిన ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ (ఈఎంఐ) ఈ వివరాలను తెలియజేసింది.

సాధారణంగా ఇప్పటివరకు ఉత్పత్తి, సర్వీస్ రంగాల్లో చైనా ఎప్పుడూ మొదటి స్థానాన్నే కైవసం చేసుకునేంది. అగ్రరాజ్యంగా పేరు సంపాదించుకున్న అమెరికా సైతం ఇటువంటి రంగాల్లో చైనాకు వెనుకే వుంటాయి. అటువంటి మన భారతదేశం సదరు రంగాల్లో ఎన్నడూలేని విధంగా మెరుగైన వృద్ధిని సాధించి చైనాను వెనక్కి నెట్టేసింది. గత నెలలో ఉత్పత్తి, సర్వీసు రంగాల్లో భారత్ పనితీరు 53 శాతానికి చేరుకోగా... చైనా కేవలం 51.6 శాతం మాత్రమే నమోదు చేసుకోగలిగింది. ఈ వివరాలను వెలువరిచిన ఈఎంఐ సైతం భారత్ విజయాన్ని చూసి షాక్ కు గురైంది.

ఇక బ్రెజిల్ 49.3 శాతం, రష్యా 51.3 శాతాలను మాత్రమే నమోదు చేసుకుని.. భారత్ కు పోటీ ఇవ్వలేకపోయాయి. ఈ విధంగా గణాంకాలను నమోదు చేసుకోవడంలో మన భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ భారత్ ఇదే పనితీరు కనబరుస్తూ ముందుకు దూసుకెళ్తే.. భవిష్యత్తులో సరికొత్త సంచలనాలను నమోదు చేసుకోవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles