Ap cm chandrababu to hold collectors conference at vijayawada

chandrababu meeting district collectors, star hotels vijayawada, vijayawada, district collectors, chandrababu naidu ap cm, five star hotels

AP CM Chandrababu to hold collectors conference at Vijayawada:Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu has convened a meeting of District Collectors at Vijayawada on Thursday. Deviating from the earlier procedure of holding District Collectors’ conference in Hyderabad, Naidu has said the event will be held in Vijayawada.

చేసిన జీవో ఏమిటీ? చేస్తున్న పని ఏమిటి? బాబు

Posted: 08/07/2014 10:49 AM IST
Ap cm chandrababu to hold collectors conference at vijayawada

అయ్యా.. !! ఆంద్రప్రదేద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు.. మీరు చేస్తున్న పని ఏమిటి? మీరు జీవో సంగతి అప్పడే మరిచిపోయావా? .. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొండి సార్!!! ఒకవైపు పొదుపు పాటించాలని మంత్రులకు హితబోధ చేస్తూనే, మరోవైపు సమావేశాల కోసం లక్షల్లో ఖర్చు చేయటం ఏమైన న్యాయమా?

ఈరోజు సీఎం చంద్రబాబు విజయవాడలో కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. ఇందుకోసం ఫైవ్‌‌స్టార్ హోటల్‌ని వేదికగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు తాజ్ గేట్ వే‌లో స్పెషల్ షూట్‌లను బుక్ చేశారు. ప్రభుత్వ కార్యదర్శికి, మిగతా కార్యదర్శలకు స్టార్ హోటల్‌లో విడిదిగా ఏర్పాటు చేయగా... జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిటీ పోలీసు కమిషనర్లకు మినర్వా, ఐలాపురం హోటళ్లు రెడీ చేశారు.

ఏపీ ప్రభుత్వం స్టార్ హోటల్‌లో సమావేశాలు నిర్వహించడమేంటంటూ రాజకీయ పార్టీల్లో చర్చ మొదలైంది. ఆర్థికస్థితి బాగా లేకపోవడంతో స్టార్ హోటల్‌లో అధికారిక కార్యక్రమాలను నిషేధిస్తున్నట్లు కొద్దిరోజుల కిందట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈలోగానే స్టార్ హోటల్‌లో సమావేశం నిర్వహించడం రాజకీయ నేతలకు అంతుబట్టడంలేదు. ప్రభుత్వ సమావేశాలకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీని గతంలో ఎంపిక చేసినప్పటికీ పార్కింగ్ సమస్య తలెత్తడంతో వేదికను మార్చినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.

విజయవాడ సమావేశానికి ముప్పై లక్షల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. మంత్రులు, ఐఎఎస్, ఐపిఎస్ లు అంతా అక్కడకు వెళ్లారు.కాగా కర్నూలు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి బస చేయడానికి వీలుగా అతిది గృహాన్ని ముప్పై లక్షల వ్యయంతో పునరుద్దరణ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తీరుపై ఇటు వైసీపీ, అటు కాంగ్రెస్ నేతలు పసుపు చొక్కలను ఉతికారేస్తున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles