Indian army official arrested for leaking information to pak facebook friend anushka agrawal

honey trap, Naik Subedar Patak Kumar Poddar, Naik Subedar arrest, Anushka Agarwal indian army officer, pakistan facebook girl friend, Pak woman

Indian army official arrested for leaking sensitive information: Indian daily reported that the Hyderabad police arrested Naik Subedar Patak Kumar Poddar, who works in the artillery centre, on Wednesday. Official sources said the woman is suspected to be Pakistani.Further, it was said that the official walked into what appears to be a “honey trap” a year ago and was in touch with the woman who identified herself as Anushka Agarwal on Facebook,

అనుష్క నగ్న అందాలకు ఆర్మీ రహస్యలను లీక్ చేసిన అధికారి?

Posted: 08/07/2014 08:00 AM IST
Indian army official arrested for leaking information to pak facebook friend anushka agrawal

ఆడదాని చేతిలో పడిన ఏలాంటి మగాడైన..లొంగిపోవాల్సిందే. ఆడదాని కోసం .. రాజ్యాలు పొగొట్టుకున్న రాజులను చూశాం, ఆడదాని కోసం ఆస్తులు పొగొట్టుకొని భికారిగా మారిన వ్యాపారస్థులను చూశాం..! ఆడపిల్ల కోసం హత్యలు చేసిన ప్రేమికులను చూశాం.. ! కానీ కేవలం ఒక ఆడదాని నగ్న అందాల కోసం .. దేశ ముఖ్య రహస్యలను బయట పెట్టిన ఆర్మీ అధికారి. అధీ కూడా.. లైవ్ లో ఆమె ఆందాలను చూడాలేదు!! ఆ అందాల సుందరి ఉన్నది పాకిస్థాన్ లో.. ఆర్మీ అధికారి ఉన్నది హైదరాబాద్ లో... ! మరీ ఈ ఇద్దర్ని కలిపింది ఎవరో కాదు.. ! మన ఫేస్ బుకే! ఈ ఫేస్ బుక్ ఛాటింగ్ లో ఆమె అందాలను చూసి .. అతిరహస్యంగా దాగి ఉండే.. రహస్యలను చెప్పటం జరిగింది.
‘‘అందం ముందు నగ్నంగా నిలబడి ఏం జరుగుతుంది’’ అలాగే .. ఆ పాకిస్థాన్ యువతి.. వెబ్ కెమెరా ముందు తన అందాలను వాడి వేడిగా ఆర్మీ అధికారికి వడ్డించింది. అంతే మన హైదరాబాద్ లో ఉన్న ఆర్మీ అధికారి..సొంగకార్చుకుంటూ.. ఆమెకు అన్నీ రహస్యలు బయటపెట్టి ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఈ అధికారికి ఆమె నగ్న మత్తు వదిలింది.

ఈ ఇద్దరి మద్య ఇలా జరిగింది!

దేశంకోసం ప్రాణాలర్పించడానికైనా సిద్ధంగా ఉండే ఆర్మీలో ఓ అధికారి పాకిస్థాన్ ఏజెన్సీలు పన్నిన వలలో చిక్కుకున్నాడు. సదరు సంస్థలు ఎరవేసిన ఓ యువతితో అశ్లీల వీడియో చాటింగ్‌తో ఫిదా అయి.. కీలకమైన రహస్య సమాచారాన్ని ఆమెకు అందించాడు. హైదరాబాద్ నుంచి పాకిస్థాన్‌కు సాగిన ఈ వ్యవహారం రహస్య నిఘా బృందాల్లో కలవరం రేపింది. కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూపీ లాగడంతో రెండేళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంలో సంచలన్మాతక వాస్తవాలు బయటపడ్డాయి. యువతిని ఎరగావేసిన పాక్ సంస్థలు తమకు కావాల్సిన సమాచారం మొత్తం లాక్కున్నాయని తేలింది.

honey trap-pakistan-facebook

ఇతడే ఆ ఘనుడు..

సికింద్రాబాద్ ఆర్మీ ఈఎంఈ యూనిట్‌లో నాయక్ సుబేదార్ హోదాలో పనిచేస్తున్న పఠాన్ కుమార్ పొద్దార్ డిప్యూటేషన్‌పై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధి నిర్వహణలో ఉన్నాడు. ఇతడిని బెంగాల్‌వాసిగా గుర్తించారు. ఆర్మీ నిబంధనలకు విరుద్ధంగా సెక్యూర్ లైఫ్ అనే ప్రైవేట్ వ్యాపారం కూడా నడుపుతున్నాడు. నెట్‌వర్క్ మార్కెటింగ్ పేరుతో తోటి ఆర్మీ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులను చైన్ లింక్ సిస్టమ్‌తో బిజినెస్‌లో చేర్చుకున్నాడు. నిత్యం సోషల్ నెట్‌వర్క్ సైట్లలో బిజీగా ఉండే పొద్దార్.. ఇదే క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ యువతితో ఫేస్‌బుక్, ఇతర సైట్ల ద్వారా పరిచయం పెంచుకున్నాడు.

పాక్ సంస్థలు ఈ యువతిని ఎరగా వేసి.. పొద్దార్ నుంచి ఆర్మీకి చెందిన రహస్య వివరాలు సంపాదించినట్లు తెలుస్తున్నది. పరిచయం పేరుతో పఠాన్ చేసే ఉద్యోగం, ఎలా ఉంటుంది? ఆపరేషన్స్ ఎలా చేస్తారు? అంటూ మాటామాటా కలుపుతూ ఫోన్‌లో కూడా మాట్లాడిన యువతికి పడిపోయిన పఠాన్ కుమార్ దేశవ్యాప్తంగా ఉండే ఆర్మీ వివరాలు మొత్తం ఆమెకు చేరవేశాడు. ఆర్మీలో ఉండే కీలక నెట్‌వర్క్ వ్యవస్థ పనితీరు, అధికారులు పేర్లు, ఫోన్ నంబర్లు, బేస్ క్యాంప్‌ల వివరాలు, హెడ్ క్వార్టర్స్ అడ్రస్‌లు, వంతెనల వివరాలను సవివరంగా యువతికి చెప్పేశాడు. హైదరాబాద్ నగరంలో ఎన్ని క్యాంప్‌లున్నాయి? వాటి ఆపరేటివ్ హెడ్స్ ఎవరు? వంటి వివరాలను అధికారుల నంబర్లతో సహా యువతికి చేరవేశాడు.

హనీ ట్రాప్..

పఠాన్‌తో చాట్ చేసిన పాక్ యువతి హనీ ట్రాప్ విధానాన్ని అవలంబించింది. అనుష్క అగర్వాల్ పేరుతో స్కైప్ సహాయంతో వీడియో చాట్ చేస్తూ అశ్లీల నెట్‌వర్క్ సైట్లు, ఓపెన్ సెక్స్ చాటింగ్ పేరుతో పఠాన్‌ను ముగ్గులోకి దించింది. గతంలో పాక్ ఏజెన్సీలు ఇదే విధంగా పలు దేశాల్లో రహస్య వివరాలను సేకరించారని సమాచారం. వారు చేసే విధానానికి నిఘా విభాగాలు హనీ ట్రాప్ అని నామకరణంచేశాయి. ఈ విషయం తెలుసుకోలేని ఆర్మీ సుబేదార్ పఠాన్ యువతికి లొంగిపోవడం ఇప్పుడు దేశ్యవ్యాప్తంగా భద్రత ముప్పుగా మారిందనడంలో సందేహంలేదు.

అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్

అంతర్గత భద్రత, టెర్రిరస్టుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించే రాష్ట్ర నిఘా వర్గాల్లో కీలక పాత్రపోషించే కౌంటర్ ఇంటెలిజెన్స్ దాదాపు 6 నెలలుగా పఠాన్‌పై దృష్టి సారించింది. పాకిస్థాన్ నుంచి నెట్‌వర్క్ ద్వారా హైదరాబాద్‌లోని ఆర్మీకి క్యాంప్‌కు మెసేజ్‌లు రావడంపై ఆరా తీసింది. పఠాన్ దీనిలో కీలక పాత్రపోషిస్తున్నాడని పూర్తి ఆధారాలతో కనిపెట్టింది. ఈ మేరకు నగర సీపీ మహేందర్‌రెడ్డికి సూచనలు చేసింది. రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ బృందాలు పఠాన్‌ను అరెస్ట్ చేశాయి.
పఠాన్‌పై దేశద్రోహం చట్టం 1923 కింద 3,4,5 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదుచేసింది. 120-బి రెడ్ విత్ 34, 3అండ్ 4 ప్రైజ్ చీటింగ్ మనీ సర్క్యూలేషన్ బ్యానింగ్ యాక్ట్ 1977 ప్రకారం సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. పఠాన్ కుమార్ పొద్దార్‌ను కోర్టులో ప్రవేశపెట్టినట్టు పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. మిగతా వివరాలు రాబట్టేందుకు కస్టడీలోకి తీసుకుంటామని చెప్పారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles