Train passengers saved man life in australia

train passengers, man stucked between platfrom and train, man leg stucked railway station, railway passengers saved man life, australia train passengers, australian train passengers saved man life

train passengers saved man life in australia : the train passengers saved a man's life who's leg stuck between the platform and train carriage.

ఒక్కడి కోసం రైలునే వంచేశారు!!

Posted: 08/06/2014 07:17 PM IST
Train passengers saved man life in australia

(Image source from: train passengers saved man life in australia)

ప్రాణాపాయ స్థితిలో వున్న ఒక్క వ్యక్తిని కాపాడటం కోసం ఒక రైలునే నెట్టేశారు అక్కడి స్థానికులు. ఒక్కడి ప్రాణాలను బతికించడం కోసం వందలాది మంది కలిసి ఒక రైలును పక్కకు నెట్టేసి.. ‘‘ఐకమత్యమే మహాబలం’’ అన్ని పదాన్ని నిరూపించారు. కలిసుంటే రెండు ప్రపంచాల మధ్య వున్న వైరుధ్యాన్ని దూరం చేయవచ్చునని, ఒకరి బాధల్ని మరొకరు పంచుకోవచ్చనే మాటలను నిదర్శనంగా నిలిచారు ఆ స్థానికులు.

ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరంలో స్టిర్లింగ్ స్టేషన్ లో ఆగివున్న రైలును ఒక ప్రయాణికుడు ఎక్కుతుండగా.. అనుకోకుండా అతని కాలు జారి రైలు క్యారేజ్ కి, ఫ్లాట్ ఫామ్ కి మధ్యనున్న 5 సెం.మీ. చిన్న గ్యాప్ లో ఇరుక్కుపోయింది. అతను తన కాలిని బయటికి తీయడానికి ఎంత ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. అయితే ఈ విషయాన్ని గమనించిన అక్కడి మిగతా ప్యాసింజర్లు.. అతడ్ని బయటకు రప్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఎంత చేసినప్పటికీ అతను మాత్రం బయటకు రాలేకపోయాడు. ఇక అతని సంగతి అంతేనేమోనని భావించారు అందరూ!

అయితే అదే సమయంలో అక్కడున్న రైల్వే సిబ్బందికి ఒక ఆలోచన తట్టింది. వెంటనే రైల్లో వున్న ప్రయాణికులందరినీ కిందకు దించేసి... వారందరి సహాయంతో రైలును ముందుకు వంచారు. మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా.. ప్రజలు మాత్రం వెనక్కు తగ్గకుండా రైలును బలంగా ముందుకు నెట్టారు. అంతే.. ఆ చిన్న గ్యాప్ లో నుంచి ఇరుక్కున్న వ్యక్తి బయటపడ్డాడు. అతనికి ఏ అపాయం జరగకుండా బయటపడటంతో అక్కడున్న వారందరూ ఒకరి ప్రాణాలను కాపాడామన్న సంతోషాన్ని వ్యక్తం చేశారు.

‘‘ఇంతవరకు రైలుకింద పడి మరణించిన సంఘటనలు చాలానే జరిగాయి కానీ... ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడే సంఘటన కళ్లారా వీక్షించడం ఇదే మొదటిసారి’’ అంటూ అతని ప్రాణాలను కాపాడిన తోటి ప్రయాణికులు చెప్పుకుంటూ తమ మనసులో వున్న అనుభవాలను పంచుకుంటున్నారు. అయినా ఇటువంటి సంఘటనల్లో పాలుపంచుకోవడంలో దానికుండే కిక్కేవేరప్పా!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles