Rbi governor raghuram clarification andhra pradesh telangana loan waiver

rbi governor raghuram rajan, raghuram rajan press meet, raghuram rajan waiver loan, cm chandrababu naidu, cm kcr news, chandrababu kcr, andhra telangana loan waiver, andhra telangana farmers

rbi governor raghuram clarification andhra pradesh telangana loan waiver : RBI governor raghu ram finally give clarification on loan waivers that they will not help in this situation.

నోటి దగ్గరున్న మెతుకును వెనక్కు తీసుకున్నారు!

Posted: 08/06/2014 12:27 PM IST
Rbi governor raghuram clarification andhra pradesh telangana loan waiver

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర రైతులకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా రుణాలను మాఫీ చేయిస్తానని ఇన్నాళ్లవరకు చెప్పుకుంటూ వచ్చిన నేపథ్యంలో... ఆయనకు, ఆంధ్ర రైతన్నలకు భారతీయ రిజర్వు బ్యాంకు దిమ్మతిరిగిపోయేలా సమాధానం ఇచ్చింది. రుణమాఫీ హామీలు త్వరలోనే అమలు అవుతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉమ్మడి రాష్ట్రాల రైతులను రిజర్వ్ బ్యాంకు కోలుకోలేని పరిస్థితికి తీసుకెళ్లిపోయింది. తమ బాధలు పూర్తిగా తొలగిపోతాయి... ఇకనుంచి కనీసం రెండుపూట్లయినా కడుపునిండా భోజనం చేయొచ్చు అని భావించిన రైతన్నలకు... నోటి దగ్గరున్న మెతుకును రిజర్వ్ బ్యాంక్ వెనక్కు లాగేసుకుంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యవసాయ రుణాలను మాఫీ చేయాల్సిన పరిస్థితులు, రీషెడ్యూల్ చేయాల్సి అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన నిర్దిష్టమైన ప్రతిపాదన తమ దగ్గర లేదని ఆయన తెలిపారు. ఈ విషయం మీద మంగళవారం రఘురాం విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ... ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందు అనవసరంగా రైతులకు హామీలిచ్చారని, కొంచెం కూడా అవగాహన లేకుండా ప్రవర్తించిన ఆ రాష్ట్రాలు మంత్రులు ఇప్పుడు ఈ రుణమాఫీపై ఎటువంటి ప్రక్రియను అనుసరిస్తారోనని ఆయన వెల్లడించారు. అంటే.. రుణమాఫీలు ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యపడదని ఆయన తేల్చి చెప్పేశారు.

ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ... ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే, ఆయా ప్రాంతాలకు చెందిన జిల్లా కలెక్టర్లు తమ ప్రాంతాల్లో పంటలకు వాటిల్లిన నష్టాలను ప్రకటిస్తారు. అటువంటి ప్రాంతాలలో రుణాలను నిరర్ధక రుణాలుగా పరిగణించరని ఆయన పేర్కొన్నారు. ‘‘తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితులు వున్నట్లు గత ఏడాది ఏ జిల్లా కలెక్టర్ కూడా ప్రకటించలేదు. పైగా దిగుబడులు కూడా బాగానే వచ్చాయి. ఇందుకు సంబంధించిన మేము గణాంకాలను పరిశీలిస్తే.. తుపాను వల్ల అపార నష్టం జరిగినట్లు కనిపించడం లేదు. రుణాల పునర్ వ్యవస్థీకరణకు అధికారుల నుంచి మాకు ఎటువంటి విజ్ఞప్తులు కూడా రాలేదు’’ అని ఆయన తేల్చి చెప్పేశారు.

ఈ విధంగా రుణాలు ఇవ్వబోమని ఆర్బీఐ గవర్నర్ రఘురాం కుండబద్ధలు కొట్టిన అనంతరం.. ‘‘వాస్తవంగా సమస్యలు ఎక్కడ వుందో తెలుసుకోవడానికి ప్రస్తుతం మేము రెండు రాష్ట్రాల మంత్రులతో చర్చలు కొనసాగిస్తున్నాం. అప్పుడే ఈ విషయంపై ఒక స్పష్టమైన అభిప్రాయానికి రావడానికి వీలుగా వుంటుంది. ఒకవేళ ఏదైనా పథకాన్ని ప్రకటించినా.. ‘‘మోరల్ హెజార్డ్’’కు అవకాశం లేని విధంగా వుంటుంది. ప్రస్తుతం చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. నిర్దిష్టమైన కార్యాచరణ రూపుదిద్దుకోలేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. (మోరల్ హెజార్డ్ అంటే... అవతలి వారు బాధ్యత తీసుకుంటారని స్పష్టంగా తెలిసినప్పుడు.. తమ బాధ్యతను సక్రమంగా నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే పరిస్థితి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles