Chandrababu naidu independece day plans kurnool town

ap cm chandrababu naidu, chandrababu naidu flag hoisting, kurnool town, chandrababu kurnool town, chandrababu independence day, independence day kurnool town, chandrababu naidu latest news

Chandrababu naidu independece day plans kurnool town : ap cm chandrababu naidu is planning to celebrate the independence day in kurnool town which is the first capital of andhra before 1956. After a long time the kurnool town is celebrating this festival.

ఆగస్టు 15న ఆంధ్ర రాజధానిగా ‘‘కర్నూల్’’!!

Posted: 08/06/2014 01:57 PM IST
Chandrababu naidu independece day plans kurnool town

(Image source from: Chandrababu naidu independece day plans kurnool town)

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఇప్పటివరకు పూర్తిగా క్లారిఫికేషన్ అయితే రాలేదు కానీ.. బహుశా ‘‘కర్నూలు’’ను ఎంపిక చేసే అవకాశాలు వున్నాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాబు వ్యవహరిస్తున్న తాజా పరిణామాలను చూస్తుంటే ఇటువంటి అనుమానాలే వ్యక్తమవుతున్నాయని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆగస్టు 15వ తేదీనాడు తెలుస్తాయని చెప్పుకుంటున్నారు.

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రరాష్ట్రానికి రాజధానిగా కర్నూలు వున్న విషయం తెలిసిందే! స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం 1956వరకు ఇక్కడ వరుసగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించుకునేవారు. కానీ రాజధాని హైదరాబాద్ కు తరలివెళ్లిపోవడంతో.. అప్పటి నుంచి ఇప్పటివరకు అది బోసిగానే వుండిపోయింది. కానీ ఇన్నాళ్ల తరువాత తిరిగి కర్నూలు జిల్లాలకు ఆ వేడుకల శోభ రాబోతోంది. విభజన తర్వాత మొదటిసారిగా ఏపీ సర్కార్ కర్నూలులో ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య వేడుకల్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంది. దీంతో కర్నూల్ టౌన్ మొత్తం ఎన్నడూలేని విధంగా చాలా సుందరంగా ముస్తాబవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం వేగంగా పూర్తి చేస్తోంది!

విభజన తర్వాత కర్నూలులో మొదటి వేడుకలు కావడంతో భారీ భద్రతల మధ్య ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘‘ఏపీ సన్ రైజ్’’ అనే పేరుతో ఈ వేడుకలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎస్పీ రెండో బెటాలియన్ గ్రౌండ్ ను అధికారులు ఎంపిక చేసుకున్నారు. ఈ వేడుకలను వీక్షించేందుకు నగర ప్రజలకు వీలుగా భారీ లెడ్ స్ర్కీన్లను కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ విధంగా అట్టహాసంగా ఇలా వేడుకలు నిర్వహించడంపై కొంతమంది రాజకీయ నేతలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలును ఎన్నుకునే సూచనలున్నాయని.. అందువల్లే ఇలా వేడుకలు నిర్వహిస్తున్నారని చెప్పుకుంటున్నారు.

ఇదిలావుండగా.. కర్నూలు నగర ప్రజలందరూ తమ పట్టణాభివృద్ధికి ఏవైనా పథకాలు అమలు చేయాలని బాబును డిమాండ్ చేస్తున్నారు. రాజధాని తరలిపోయిన అనంతరం కర్నూలును పట్టించుకున్న నాథుడే లేడని.. ఇప్పుడైనా దీనిపై దృష్టి సారించి పెండింగ్ లో వున్న ప్రాజెక్టులు, ఉద్యోగ - ఉపాధి అవకాశాలను కల్పించేలా చేయాలని వారు కోరుతున్నారు. ఇంతేకాదు.. కర్నూలునే ఏపీ రాజధానిగా నియమించాలని అక్కడి ప్రజలు మాంచి ఊపుమీద డిమాండ్లతో ముందుకొస్తున్నారు. మరి దీనిపై చంద్రబాబు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు..? ఆంధ్ర రాజధానిగా కర్నూలును నియమిస్తారా..? లేదా..? అన్న విషయాల గురించి తెలుసుకోవాలంటే ఆగస్టు 15వరకు ఆగాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles